తస్మాత్ జాగ్రత్త.. వీటిని ఎక్కువగా తింటే బరువు పెరగడమే కాదు బీజీ, షుగర్ వస్తాయి..

by Sumithra |
తస్మాత్ జాగ్రత్త.. వీటిని ఎక్కువగా తింటే బరువు పెరగడమే కాదు బీజీ, షుగర్ వస్తాయి..
X

దిశ, ఫీచర్స్ : మన ఆరోగ్యం బాగుండాలన్నా, చెడిపోవాలన్నా మనం తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకుంటే శరీరం దృఢంగా ఉంటుంది. కానీ కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం చెడిపోవడమే కాదు బరువును త్వరగా పెంచి బీజీ, షుగర్ లాంటివి వస్తుంటాయి. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ ని తీసుకోకూడదు, నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

స్వీట్స్..

చాలా మంది స్వీట్స్ ను ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ప్రాసెస్డ్ ఫుడ్స్‌, చెక్కర, పాలతో తయారైన పిండివంటలు, కేక్స్, స్వీట్స్ తింటుంటారు. అధికంగా తీపి వస్తువులు తినడం వలన రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరిగి గుండె సమస్యలు, బీపీ, షుగర్, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే స్వీట్స్ ని తగ్గించాలని తెలుపుతున్నారు.

ప్రాసెస్డ్ ఫుడ్స్..

ఎప్పుడో తయారు చేసి ప్యాకింగ్ చేసిన ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వలన శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. చలికాలంలో ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ తింటే కొవ్వు శాతం పెరిగి గుండె సమస్యలు, హై బీపీ వస్తాయంటున్నారు.

ఉప్పు..

వంటల్లో అన్ని వేసి చూడు.. నన్ను వేసి చూడు అంటుంది ఉప్పు. ఇలాంటి ఉప్పును ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే తినాలి. ఉప్పు ఎక్కువగా తినడం వలన బీపీ పెరిగి గుండె సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దు.

జంక్ ఫుడ్ తింటే..

చాలామంది రోడ్ సైడ్ ఫుడ్ ని తినేందుకు ఇష్టపడతారు. వేడివేడిగా ఉండే పిజ్జా, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ను తింటారు. అలాగే నూనెలో బజ్జీలు తీసుకునేందుకు మొగ్గుచూపుతారు. ఇలాంటి ఆహారం తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ ఆహారంలో ఉండే కేలరీలు, ట్రాన్స్‌ఫ్యాట్స్ తో కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

పిజ్జా..

పిజ్జాను తినడం ఆరోగ్యానికి హానికరం. దీన్ని ప్రాసెస్డ్ పిండితో తయారు చేయడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు అధికంగా వస్తాయి. ఇందులో ఉండే శాచ్యురేటెడ్ ఫ్యాట్, కేలరీలు కొలెస్ట్రాల్ ను పెంచి హై బీపీ, గుండె సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువ.

Advertisement

Next Story

Most Viewed