ఈ అలవాట్లు లేకపోతే ఇక మీ లైప్ సూపర్

by Kalyani |   ( Updated:2023-06-28 09:49:46.0  )
ఈ అలవాట్లు లేకపోతే ఇక మీ లైప్ సూపర్
X

దిశ, వెబ్ డెస్క్: జీవితంలో ప్రతి ఒక్కరికీ తెలిసి తెలియక ఉండకూడని అలవాట్లు ఉంటాయి. వాటి వల్ల జీవితంలో వచ్చే నష్టంపై వారికి అవగాహన ఉండకపోవచ్చు. అందుకనే వారికి సమస్యలు ఎదురవుతుంటాయి. చూడడానికి ఆ అలవాట్లు చిన్నవిగానే అనిపించవచ్చు. కానీ దాని ప్రభావం జీవితంపై పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరీ మనపై చెడు ప్రభావం చూపే ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.

ఇతరుల చెప్పులను దొంగతనం చేయకూడదు. ఏ మతానికి చెందిన దేవుడినైనా దూషించకూడదు. చీపురును కాలితో తన్నకూడదు. బంధువులను ఏ కారణం లేకుండా తిట్టకూడదు. కాళ్లతో కుక్కను తన్నకూడదు. ఇంటికి వచ్చిన అతిథులను అవమానించకూడదు. మనని పిలువని పేరంటానికి అసలు వెళ్లకూడదు. కాళ్లు, చేతుల గోళ్లను సంధ్యాకాలం తీయకూ డదు. అద్దం పదే పదే చూడకూడదు. ఏ చెట్టు పూలనైనా కాళ్లకు తాకనివ్వరాదు. కారణం లేకుండా బ్రాహ్మణులను తిట్టకూడదు. చీటికి మాటికి ఏడ్చే మహిళలను నమ్మకూడదు. నడిచేటపుడు నేల అదురిటేట్లు నడవకూడదు. నీళ్లలో ఉమ్మించకూడదు అని చెబుతారు. ఇక ఇప్పటి నుంచి పైన చెప్పబడిన అలవాట్ల విషయంలో మీరు జాగ్రత్తలు పాటించి మీ జీవితం మొత్తం ఆనందంగా గడపండి.

Read More: పడుకునే ముందు కాళ్లు కడుక్కుంటున్నారా.. జరిగేది ఇదే..

Advertisement

Next Story