ఫిజికల్ యాక్టివిటీస్ పూర్తిగా తగ్గితే శరీరంలో జరిగే మార్పులివే.. ఆ తర్వాత క్రమంగా..

by Javid Pasha |   ( Updated:2024-08-28 11:26:40.0  )
ఫిజికల్ యాక్టివిటీస్ పూర్తిగా తగ్గితే శరీరంలో జరిగే మార్పులివే.. ఆ తర్వాత క్రమంగా..
X

దిశ, ఫీచర్స్: మనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ వ్యాయామాలు లేదా వివిధ రూపాల్లో ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ముఖ్యమన్న విషయం తెలిసిందే. అయితే కొంతకాలం గానీ, పూర్తిగా గానీ వాటిని ఆపేస్తే ఏమవుతుంది? మన శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి? పలువురిలో వ్యక్తం అవుతున్న ఈ సందేహాలకు నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం.

* హెల్తీ లైఫ్‌ స్టైల్ కోసం పోషకాహారం, క్వాలిటీ స్లీప్ ఎంత ఇంపార్టెంటో శరీరానికి ఎక్సర్‌సైజ్ కూడా అంతే ముఖ్యం అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఎందుకంటే రెగ్యులర్ వ్యాయామాలు లేకపోతే అనేక అనారోగ్యాలు దాడిచేస్తాయి. కండరాలు బలహీన పడతాయి. యాక్టివ్‌నెస్ తగ్గుతుంది. మానసిక రుగ్మతలు తలెత్తుతాయి.

* ఫిజికల్ యాక్టివిటీస్ పూర్తిగా తగ్గితే బాడీలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. హై కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. శరీరానికి తగిన శ్రమ లేనప్పుడు నిద్రలేమి, మూడ్ స్వింగ్స్ కూడా వస్తాయి. పలు రకాల స్లీప్ డిజార్డర్స్ వెంటాడుతాయి.

* అధిక బరువు పెరగడం కూడా ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడంవల్ల ఎదురయ్యే సాధారణ సమస్య. ఇది మరింత కదలిక లేని జీవన శైలికి దారితీస్తుంది. ఫలితంగా తక్కువ కేలరీలను బర్న్ చేయడం మూలంగా బాడీలో పేరుకుపోయిన అదనపు కేలరీలు కొవ్వు నిల్వలుగా మారుతాయి. క్రమంగా ఒబేసిటీకి దారితీస్తాయి.

* ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి తగ్గడం వంటివి కూడా ఫిజికల్ యాక్టివిటీస్ దీర్ఘకాలంపాటు తగ్గడంవల్ల సంభవిస్తాయి. క్రమంగా డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. ఎముకల బలహీనత ఏర్పడుతుంది. శరీరంలో రక్త ప్రసరణ మందగించడం, తలనొప్పి, మైగ్రేన్, యాంగ్జైటీస్, డిప్రెషన్ వంటివి కూడా దీర్ఘకాలంపాటు శారీరక శ్రమ తగ్గడంవల్ల సంభవిస్తాయి. కాబట్టి ఈ అనారోగ్య సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండాలని హెల్త్ అండ్ ఫిట్‌నెస్ నిపుణులు చెప్తున్నారు.

* గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed