కోకోనట్ వాటర్ ఈ సమయంలో తీసుకుంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు

by Prasanna |   ( Updated:2024-04-01 09:00:01.0  )
కోకోనట్ వాటర్ ఈ సమయంలో తీసుకుంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు
X

దిశ, ఫీచర్స్ : వేసవి కాలం మొదలైంది..ఉదయం 8 గంటలు నుంచే సూర్యుడు భగభగ మండుతున్నాడు. దీని వల్ల ప్రజలు వారి రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. చెమటలు పట్టి మన శరీరంలో ఉండే లవణాలు బయటకి పోతాయి. ఈ సమయంలో చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. కొందరు శీతల పానీయాలు, ఐస్ క్రీం లాంటివి తీసుకుంటారు. ఇవి తీసుకోవడం కొంతవరకే మంచిదే కానీ, కొత్త రోగాలను తెచ్చిపెడతాయి.

వేసవి వచ్చిందంటే చాలా మంది బాగా అలసిపోతారు. ఎందుకంటే మన శరీరంలో ఉండే నీరు బయటకు పోతుంది. కాబట్టి, ఎక్కువ నీరు ఉన్న ఆహారాన్ని జ్యూస్‌లతో కలిపి తీసుకోవాలి. ఎండాకాలం ఎంత ఎండగా ఉన్నా శరీరంలో నీరు, లవణాలు క్రమం తప్పకుండా భర్తీ చేస్తే మారుతూ ఉంటే వేసవి కాలం ముగిసే వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. కాబట్టి, నీటి శాతం ఎక్కువ ఉండే ఆహారాలను, జ్యూస్ లను తీసుకోవాలి. చాలా మంది కోకోనట్ వాటర్ తీసుకుంటారు. అయితే, ఇది ఏ సమయంలో తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..

నీరు ఎక్కువగా ఉండే ఆహారాలలో కొబ్బరి బొండం కూడా ఒకటి. ఈ ప్రకృతిలో చాలా ఆహారాలు కలుషితమవుతాయి, కానీ కొబ్బరి బొండం మాత్రమే చెట్టు నుంచి దొరుకుతుంది. అయితే, దీన్ని తాగడానికి కూడా ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో తీసుకుంటే.. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. నివేదికల ప్రకారం, కొబ్బరి బొండం ఉదయం 10 గంటలలోపు తాగాలి. ఇది మన శరీరంలో సెలైన్ వాటర్‌లా పని చేస్తుంది. అందుకే మనం అలసిపోయినప్పుడు కానీ, మోషన్స్ అయినప్పుడు కానీ కోకోనట్ వాటర్ తాగమని వైద్యులు చెబుతారు.

Read More..

నెయ్యితో నైట్ క్రీమ్.. ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుందట..

Advertisement

Next Story

Most Viewed