Idli: ఇడ్లీ మృదువుగా ఉండాలా..? ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి!

by Anjali |
Idli: ఇడ్లీ మృదువుగా ఉండాలా..? ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి!
X

దిశ, వెబ్‌డెస్క్: అందరూ ఇష్టపడే టిఫిన్స్‌లో ఇడ్లీ ఒకటి. హెల్త్ బాగోలేకపోయినా చాలా మంది ఇడ్లీకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అలాగే ఇది తొందరగా డైజెషన్ అవుతుంది. కాగా ఇడ్లీలు మృదువుగా రావాలంటే ఇలా చేయండి. ఒక్కటి కూడా మిగలకుండా కుటుంబసభ్యులంతా ఎంతో ఇష్టంగా తింటారు. మినపపప్పును క్లీన్‌గా కడుకుని.. అందులో వాటర్ పోసి 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టండి. దీంతో పాటు ఇడ్లీ రవ్వను కూడా తయారీకి గంట ముందు నానబెట్టాలి. తర్వాత మినపపప్పులో చల్లని నీళ్లు పోసి మిక్సీ పట్టండి. ఎందుకుంటే కూల్ వాటర్ పోస్తే ఇడ్లీలు మెత్తగా ఉంటాయి. తర్వాత ఈ మిశ్రమంలో ఇడ్లీ రవ్వ కలిపి ఎనిమిది గంటల పాటు పులియపెట్టాలి. తర్వాత సరిపడ సాల్ట్, వాటర్ పోసి కలిపి.. ఇడ్లీ పాత్రలో వేసి సన్నని మంటపై 10 నిమిషాలు ఉడికించండి. ఇక మెత్తని ఇడ్లీలు తయారు అయిపోయినట్లే. మీరు కూడా ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అయ్యి మ‌ృదువైన ఇడ్లీలు తయారు చేసుకోండి. మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే..? ఇడ్లీ చేసేటప్పుడు తప్పకుండా కేవలం సన్నని ఇడ్లీ రవ్వను మాత్రమే వాడండి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed