POSITIVE MINDSET : పాజిటివ్ మైండ్ సెట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి?

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-14 09:08:59.0  )
POSITIVE MINDSET : పాజిటివ్ మైండ్ సెట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి?
X

దిశ, ఫీచర్స్: పాజిటివ్ మైండ్ సెట్ అంటే జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా మంచి ఆలోచనతో ముందుకు సాగడం. ఈ పద్ధతి మెంటల్ అండ్ ఫిజికల్ గా మనిషిని స్ట్రాంగ్ గా చేస్తుంది. ఎన్ని సవాళ్లు ఫేస్ అయినా సవాల్ చేసేలా మానసికంగా మరింత బలంగా మారుస్తుంది. లైఫ్ లో ఉన్నత స్థానానికి ఎదిగేలా చేస్తుంది. మరి అలాంటి మైండ్ సెట్ ఎలా డెవలప్ చేసుకోవాలి? తెలుసుకుందాం.

మీ బలాలపై ఫోకస్

మనం తరచుగా మనకు రాని పనులపై దృష్టి పెడుతం. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటాం. అలా కాకుండా మీరు ఎందులో బెటర్ అనేది తెలుసుకుని అటు వైపుగా ఫోకస్ పెట్టండి. పాజిటివ్ రిజల్ట్ కచ్చితంగా వస్తుందని చెప్తున్నారు నిపుణులు. దీనివల్ల మైండ్ స్ట్రాంగ్ అవుతుందని అంటున్నారు.

ఫ్రెండ్స్ ఇంపార్టెంట్

మనం ఎవరితో ఫ్రెండ్ షిప్ చేస్తున్నామనేది చాలా ముఖ్యం. నెగెటివ్ మైండ్ కలిగిన వారితో స్నేహం చేస్తే జీవితం ప్రతికూలంగానే కనిపిస్తుంది. అలా కాకుండా మీ చుట్టూ ఉన్నవారు ఆశావాదులుగా ఉండేలా చూసుకోండి. సపోర్టింగ్ నేచర్ కలిగి మిమ్మల్ని మోటివేట్ చేసే వారిని మిత్రులుగా ఎంచుకోండి.

సెల్ఫ్ కేర్

లైఫ్ లో స్వీయ సంరక్షణ చాలా ముఖ్యం. మనల్ని మనం బాగా చూసుకున్నప్పుడు.. మనం మరింత సానుకూల కోణంలో చూసుకోవడం ప్రారంభిస్తాం. ఈ పద్ధతి జీవితంలో పాజిటివ్ ఎక్స్ పీరియన్స్ పొందేలా చేస్తుంది.

కృతజ్ఞతా భావం

మీ జీవితంలో జరుగుతున్న మంచి విషయాల గురించి ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉండండి. తద్వారా మీలో ఆశావాద భావం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ప్రశంసించుకుంటూ ఉండండి. దీనివల్ల పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు అవుతుంది.

ధ్యానం

మెడిటేషన్ లేదా డీప్ బ్రీత్ వంటి పద్ధతులు ఎమోషనల్ బ్యాలెన్సింగ్ లో కీలక పాత్ర పోషిస్తాయని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. దీనివల్ల లైఫ్ పై ఫోకస్ పెరుగుతుందని... పాజిటివ్ అవుట్ కమ్స్ చూస్తుంటారని చెప్తున్నారు నిపుణులు.

Read More..

Girls makeup: రోజూ మేకప్ వేసుకుంటున్నారా?.. తర్వాత ఏం జరుగుతుందంటే..

Advertisement

Next Story