పెళ్లి ఎన్ని రకాలు.. ఏ వివాహం దేనికి సంకేతం..?

by Dishaweb |   ( Updated:2023-07-05 07:12:14.0  )
పెళ్లి ఎన్ని రకాలు.. ఏ వివాహం దేనికి సంకేతం..?
X

దిశ, వెబ్‌డెస్క్ : వివాహం అనేది మానవ జీవితంలో ప్రత్యేకమైన వేడుక. అంతటి ప్రత్యేకమైన శుభకార్యాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. కలిసి నివసించడానికి తమకు గల లైంగిక హక్కులను అంగీకరిస్తూ మత పరమైన ఆచారాలచే గుర్తింపు పొందిన స్త్రీ, పురుషుల సంయోగమే వివాహము. అయితే 'యాజ్ఞవల్క్యస్మృతి' ని అనుసరించి పూర్వీకులు ఎనిమిది విధాలైన వివాహాలను శాస్త్ర సమ్మతమన్నారు. ఈ వివాహాల వల్ల వధూవరులు సుఖ సంతోషాలతో వర్థిల్లుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.

బ్రహ్మవివాహం : తల్లిదండ్రులు శక్తి కొలది వస్త్ర భూషణాదులతో తమ కూతురిని అలంకరించి సమర్థుడైన వరుడి చేతితో కూతురు చేతిని కలుపుతారు. బ్రహ్మ వివాహం అంటే మన ఇళ్లల్లో జరిగే వివాహాలు.

దైవం: యజమాని తన గృహంలో దైవయజ్ఞం చేసి, ఆ యజ్ఞాంతంలో తన పుత్రికను ఋత్విజునికి ధారాపూర్వకంగా దానం చేయడం.

ప్రాజాపత్యం: వధూవరులు ఒకచోట సుఖంగా ఉంటూ ధర్మాచరణం చేస్తారనే బుద్ధితో వరునికి కన్యాదానం చేయడం. ఈ సంప్రదాయంలో కన్యాశుల్కం లేదు.

అర్షం: కన్య తల్లిదండ్రులకు కన్యాశుల్కంగా వరుడు ఒక ఎద్దును, ఒక ఆవును ఇచ్చి కన్యాదానాన్ని గ్రహించడం.

అసురం: వరుని నుంచి కన్య తల్లిదండ్రులు అధిక ధనాన్ని తీసుకుని కన్యను ఇచ్చి వివాహం చేయడం.

గాంధర్వము: వధూవరులు పెళ్లి వయసుకు రాగానే ఒకరినొకరు ఇష్టపడి పెద్దల అంగీకారం లేకుండా చేసుకునే వివాహాన్ని గాంధర్వ వివాహం అంటారు.

పైశాచం: కన్యకు గాని వారి కుటుంబ సభ్యులకుగాని ఇష్టం లేకుండా బలవంతంగా ఆ కన్యను ఎత్తుకెళ్లి వివాహం చేసుకోవడాన్ని పైశాచము అంటారు.

రాక్షసం : వధూవరులకు ఇష్టం ఉండి పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించినపుడు వరుడు తన బలంతో కన్యను తీసుకువచ్చి వివాహం చేసుకోవడాన్ని రాక్షసం అంటారు.

ఈ పెళ్ళిళ్ళు కాకుండా స్వయంవరం అనే ఒక సంప్రదాయం స్త్రీ స్వాతంత్య్రానికి ప్రతీకగా వున్నట్లు పురాణాల్లో కనిపిస్తుంది. శివధనస్సును విరిచి శ్రీరాముడు సీతను, మత్స్యయంత్రం ఛేదించి అర్జునుడు ద్రౌపదిని పెళ్ళాడాడు. ఈ సంప్రదాయం భారత దేశ చరిత్రలోనూ ఉంది.

Read More..

శృంగారం చేయడంలో, ముద్దులు పెట్టడంలో ఈ రాశి వారికి ఎవరూ పోటి రారట.. ఇందులో మీ రాశి ఉందా..?

Advertisement

Next Story