- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయం టిఫిన్‌గా ఇది తింటే ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో..
దిశ,ఫీచర్స్ : ఉదయం టిఫిన్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొంత మంది ఆఫీస్ వర్క్ బిజీలో పడి టిఫిన్ చేయడమే మానేస్తున్నారు. కానీ ఇలా చేయకూడదంటున్నారు నిపుణులు.మార్నింగ్ అల్పహారం తీసుకోవాలంట. అంతే కాకుండా ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా పోహాను తీసుకుంటే మరింత యాక్టివ్‌గా ఉంటారంట. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
అటుకులతో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేస్తుంటారు. అందులో పోహా ఒకటి. ఇక పోహాను టిఫిన్‌గా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. అటుకులతో చాలా ఈజీగా తయారు చేసుకొనే ఈ టిఫిన్‌ను అందరూ ఇష్టంగా తింటుంటారు. దీన్ని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవడం వలన ఇది సులభంగా జీర్ణమై, కడుపు ఉబ్బరం లాంటి సమస్య దరిచేరకుండా చేస్తుదంట. అలాగే పోహాలో మంచి ఐరన్ కంటెంట్ ఉండటం వలన దీన్ని టిఫిన్‌గా తీసుకోవడం వలన రక్తహీనత సమస్య ఉండదు అంటున్నారు వైద్యులు.అలాగే శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్ల జాబితాలో పోహా మొదటి స్థానంలో ఉంటుంది. అందువలన ఇది ఆరోగ్యానికి తక్షణ శక్తి ఇస్తుందంట. అంతే కాకుండా చాలా మంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. అయితే అలాంటి వారు పోహాను టిఫిన్‌గా ఎంచుకోవడం ఉత్తమ ఎంపికనంట. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి పోహా ఆహారం సరైనది. అల్పాహారం కోసం తీసుకోవడం వల్ల లంచ్ సమయం వరకు నిండుగా ఉండేలా చేస్తుంది. ఎలాంటి అనారోగ్యకరమైన రెడీమేడ్ ఫుడ్ తినకుండా ఉండొచ్చు.