నకిలీ తేనెటీగలను సృష్టిస్తున్న పుష్పాలు.. కారణం తెలిసి సైంటిస్టులు షాక్

by Vinod kumar |   ( Updated:2023-03-31 08:41:54.0  )
నకిలీ తేనెటీగలను సృష్టిస్తున్న పుష్పాలు.. కారణం తెలిసి సైంటిస్టులు షాక్
X

దిశ, ఫీచర్స్: దక్షిణాఫ్రికాలోని ఆరెంజ్ కలర్ డైసీ ఫ్లవర్స్(చామంతి జాతికి చెందిన) పరాగ సంపర్కం కోసం వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నాయి. ప్రతీ ఏట శీతాకాలపు వర్షాల తర్వాత నమక్వాలాండ్ ఎడారిలో కొద్ది నెలల పాటు అన్ని చెట్లు కూడా భారీ మొత్తంలో పుష్పిస్తాయి. అయితే ఈ పువ్వుల సమృద్ధి డైసీల పరాగ సంపర్కానికి గట్టిపోటిని ఇస్తుంది. ఈ క్రమంలో ఇవి సరికొత్త పద్ధతిని ఎంచుకున్నాయి. తేనెటీగలను ఆకర్షించేందుకు ఆడ తేనెటీగల మాదిరిగా పెటెల్స్‌ను సృష్టిస్తున్నాయి.

నిజంగానే ఆడ తేనెటీగలనుకుని స్పాట్‌కు చేరుకున్న మేల్ బీస్.. కన్ఫ్యూజన్‌గా దాని చుట్టూ తిరిగే సమయంలోనే పుప్పొడిని తనలోకి స్వీకరించి, మరో మొక్కకు తీసుకెళ్తుంది. ఈ విధంగా పరాగసంపర్కం సులభంగా జరిగిపోతుంది. అయితే ఈ పువ్వులు ఫేక్ బీస్ సృష్టించడానికి ఏ జన్యువులు కారణమవుతున్నాయో తెలుసుకోవడానికి పరిశోధనలు నిర్వహించారు సైంటిస్టులు. మోసపూరిత ఎరను సృష్టించేందుకు మూడు సెట్ల జన్యువులను వినియోగిస్తున్నట్లు కనుగొన్నారు. ఇవన్నీ ఇప్పటికే పువ్వులో ఇతర విధులను నిర్వహిస్తున్నాయని, వాటితోపాటు ఈ అమేజింగ్ ఫ్లై క్రియేషన్‌కు కో-ఆప్ట్ చేయబడ్డాయన్నారు. గత 2.5 మిలియన్ సంవత్సరాలుగా ఈ ప్రత్యేక డైసీ ఇదే పద్ధతిని ఫాలో అవుతుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి: అక్కడ సీత రాములవారి కళ్యాణంతో పాటు హిజ్రాలకు పెళ్లి చేస్తారంట?

Advertisement

Next Story

Most Viewed