మహిళలు పబ్లిక్ వాష్‌రూమ్స్‌లో ప్రమాదాన్ని ఎలా పసిగట్టాలి?

by Hajipasha |   ( Updated:2022-09-19 15:42:55.0  )
మహిళలు పబ్లిక్ వాష్‌రూమ్స్‌లో ప్రమాదాన్ని ఎలా పసిగట్టాలి?
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది విద్యార్థినులకు సంబంధించి వారు స్నానం చేస్తున్న వీడియోలను మరో విద్యార్థిని రహస్యంగా చిత్రీకరించడం సంచలనం రేపింది. దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతుండగా.. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం వెలుగు చూడటం తెలిసిందే. అయితే తాజా ఘటన మరోసారి పబ్లిక్ వాష్‌రూమ్స్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ వాష్‌రూమ్స్‌లో అమర్చిన సీక్రెట్ కెమెరాలను గుర్తించగలిగే కొన్ని మార్గాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

* వాష్‌రూమ్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి

వాష్‌రూమ్ చుట్టూ జాగ్రత్తగా తనిఖీ చేయడం సీక్రెట్ కెమెరాలను కనుగొనే సులభమైన పద్ధతుల్లో ఒకటి. కొన్నిసార్లు మీరు అస్సలు అనుమానించని ప్రదేశంలోనే కెమెరా పెట్టే చాన్స్ ఉంది. కాబట్టి పబ్లిక్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా ఉన్నట్లయితే.. జాగ్రత్తగా శోధిస్తే కనుగొనవచ్చు.

* స్మోక్ డిటెక్టర్లు

సాధారణంగా స్మోక్ డిటెక్టర్లు పైకప్పుకు అమర్చబడి ఉంటాయి. ఎవరైనా ఆ ఎత్తులో కెమెరాను అటాచ్ చేస్తే, బాత్రూమ్‌ను వినియోగించే వ్యక్తుల మొత్తం యాక్టివిటీని చూసే వీలుంటుంది. కాబట్టి స్మోక్ డిటెక్టర్స్‌ను కూడా తప్పకుండా తనిఖీ చేయడం బెటర్.

* టిష్యూ బాక్స్‌లు

ప్రతి బాత్రూమ్‌లో టిష్యూ బాక్స్‌లు ఉండటం కామన్. నిజానికి ఆ ప్రదేశంలో సీక్రెట్ కెమెరా అమర్చుతారని ఎవరూ ఆలోచించరు. కానీ ఈ బాక్స్‌ల లొకేషన్‌తో పాటు అనుమానాస్పదంగా కనిపిస్తే మాత్రం జాగ్రత్తపడాల్సిందే. ఇక మీరు వాష్‌రూమ్ గుండా వెళ్తున్నపుడు అనుమానాస్పద వైర్లు లేదా వింత లెన్స్‌లు ఏవైనా ఉన్నాయో గమనించాలి. ఒకవేళ మీకు తెలియని పరికరాలు ఏవైనా ప్లగ్ చేసినట్లు గుర్తిస్తే వాటిని అన్‌ప్లగ్ చేయడానికి సంకోచించవద్దు. అలాగే కదిలేటప్పుడు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఈ తరహా కెమెరాల్లో కొన్ని మోషన్ సెన్సార్స్ ఉంటాయి. అవి పని చేస్తున్నప్పుడు శబ్దాలు చేస్తాయి.

* మొబైల్ ఫోన్‌తో రక్షణ

సీక్రెట్ కెమెరాలు చాలావరకు కాల్స్‌కు అంతరాయం కలిగించే రేడియో ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తాయి. కాబట్టి మీ మొబైల్ ఫోన్‌తో ఒక సాధారణ కాల్ చేయడం మీకు సహాయపడుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా రిపిటేటివ్ క్లిక్ సౌండ్ గమనించినట్లయితే.. అలాగే కాల్‌ కంటిన్యూ చేయడం ద్వారా కెమెరా-విద్యుదయస్కాంత క్షేత్రానికి అంతరాయం కలిగించే అవకాశం ఉంది.

* ఫోన్ కెమెరాతో పసిగట్టండి

మీ ఫోన్ కెమెరాను ఆన్ చేసి దాని ద్వారా చుట్టూ చూసినపుడు నైట్-విజన్ కెమెరాల నుంచి ఏవైనా ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు కనిపించడంలో మీకు సహాయపడుతుంది. ఇక వాష్‌రూమ్‌లో నెట్‌వర్క్ ఉందా? లేదా? వెతకండి. మీ మొబైల్ ఫోన్‌లో ఏ నెట్‌వర్క్‌ను కనుగొనలేకపోతే, వాష్‌రూమ్‌లో కొన్ని సీక్రెట్ కెమెరాలు సెటప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఒకటి కాదు.. రెండు కాదు.. అక్కడ ఎన్నో అందాలు

Advertisement

Next Story

Most Viewed