- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mutton roast: నోట్లో నీళ్లూరే మటన్ రోస్ట్.. హోటల్ స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
దిశ, వెబ్‌డెస్క్: మటన్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మటన్‌లో B1,B2 ,B3, B9 ,B12, విటమిన్ E,K పుష్కలంగా ఉంటాయి. కాగా గర్భిణులు మటన్ తినడం వల్ల పుట్టబోయే పిల్లలు హెల్తీగా ఉంటారు. వారికి న్యూరల్ ట్యూబ్ లాంటి ప్రాబ్లమ్స్ తలెత్తవు. మటన్ లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది బోన్స్ ను స్ట్రాంగ్ గా ఉంచుతూ.. దంతాలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ వాటిని దృఢంగా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న మటన్ వేపుడును హోటల్ స్టైల్ లో ఇలా తయారు చేసుకోండి. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మటన్ వేపుడుకు కావాల్సిన పదార్థాలు..
మటన్ 1/2 కేజీ , టీస్పూన్ పసుపు, కారం, టీస్పూన్ సాల్ట్, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, కరివేపాకు, లవంగాలు తీసుకోవాలి.
మటన్ వేపుడు తయారీ విధానం..
మటన్ శుభ్రంగా కడుక్కుని ఒక కుక్కర్ లో పెట్టాలి. తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి కలపాలి. అందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, లవంగాల, దాల్చిన చెక్క, వేసి మటన్ లో కొద్దిగా వాటర్ పోయాలి. 7 విజిల్స్ వచ్చేవరకు స్టౌ పైనే ఉంటాలి. మొత్తం ఉడికాక దాన్ని పక్కన పెట్టి.. మరో కడాయి తీసుకుని అందులో కాస్త ఆయిల్ వేసి ఉల్లిపాయలు, కరివేపాకు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.
పక్కకు పెట్టుకున్న మటన్ ను వాటర్ తో అలాగే వేయాలి. ఇక కాస్త మంట ఎక్కువగా పెట్టి వాటర్ మొత్తం ఇనికేవరకు ఉంచాలి. 15 నిమిషాలయ్యాక కలర్ చేంజ్ అవుతుంది. మొత్తం ఫ్రై అవుతుంది తర్వాత టీస్పూన్ ధనియాల పొడి, కారం, గరం మాసాలా జీలకర్ర పొడి వేసి కలుపుకోండి. తర్వాత చివర్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే మటన్ రోస్ట్ రెడీ అయిపోయినట్లై. బోన్స్ ను స్ట్రాంగ్ ఉంచే ఈ మటన్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.