history of lipstick: మొదటగా లిప్‌స్టిక్ వాడింది అబ్బాయిలే.. దేనితో తయారు చేశారంటే?

by Anjali |
history of lipstick: మొదటగా లిప్‌స్టిక్ వాడింది అబ్బాయిలే.. దేనితో తయారు చేశారంటే?
X

దిశ, ఫీచర్స్: లిప్‌స్టిక్ ఆడవారి సౌందర్య సాధనాల్లో ఒకటి. సాధారణంగా అమ్మాయిలు నలుగురిలో అందంగా కనిపించడం కోసం లిప్‌స్టిక్‌ పెదాలకు పెట్టుకుంటారు. ఏ పార్టీకి, ఫంక్షన్‌కెళ్లినా లిప్‌స్టిక్ కచ్చితంగా ఉండాల్సిందే.పర్ఫ్యూమ్ కొట్టుకోవాల్సిందే. కొందరు అమ్మాయిలు అయితే మాస్క్ వేసుకున్నా సరే పెదాలకు తప్పకుండా లిప్‌స్టిక్ వేయాల్సిందే. లిప్‌స్టిక్ అంటే అంతలా పడిచచ్చిపోతారు కొంతమంది అమ్మాయిలు. ఇది వారి అదాన్ని కూడా మరింతగా పెంచుతుంది మరీ.

అయితే ఈ లిప్‌స్టిక్‌ను పూర్వం అబ్బాయిలే ముందుగా ఉపయోగించారట. క్రీస్తుపూర్వం 3700 నాటి పురాతన మెసొపొటేమియాలో ఉద్భవించిన లిప్‌స్టిక్ ఫస్ట్ టైమ్ క్వాన్ షుబ్ యాడ్ అనే అబ్బాయి వాడారట. తర్వాత క్రీస్తుపూర్వ 2000 ప్రాంతంలో ఈజిప్టులోని రాజవశీయులు, పురుషులు ఉపయోగించడం ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి ఆడవాళ్లు విలువైన రత్నాలను నూరి పొడిలా చేసి..తమ లిప్స్‌కు పెట్టుకునేవారట. ఆ కాలంలో మహిళలు కేవలం ఎరుపురంగును మాత్రమే యూజ్ చేసేవారట.

సెక్స్ వర్కర్లు మాత్రమే వాడాలని రూల్..

తర్వాత లిప్‌స్టిక్ విలువ తగ్గిపోవడంతో కేవలం సెక్స్ వర్కర్లు మాత్రమే వాడాలనే నియమాన్ని తీసుకొచ్చారు. దీన్ని ఆర్టిఫిషీయల్ కలర్‌గా చూడడం ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి సెక్స్ వర్కర్లు ఎప్పుడు వారి పెదాలకు లిప్‌స్టిక్ ఉండాలనే ఓ కొత్త రూల్ తీసుకొచ్చారు. రోమన్ సివిలైజేషన్ సమయంలో అయితే కేవలం బాయ్స్ మాత్రమే పెట్టుకుని తమ స్టేటస్ గుర్తుగా భావించేవారట. లిప్‌స్టిక్ అలంకరించుకునే అమ్మాయిలు ఎక్కడో ఓ చోట కనిపించేవారట.

లిప్‌స్టిక్ వాడడం దేవుడిని అవమానించినట్లు..

ఇక 1700 సంవత్సర కాలంలో లిప్‌స్టిక్ విషయంలో మరిన్ని కఠిన నియమాలు తీసుకొచ్చారు. పెదాలకు రంగు వేసుకుంటే భగవంతుడు ఇచ్చిన రూపాన్ని మం అవమానించినట్లేనని భావించి.. మతపరమైన కారణాల వల్ల లిప్‌స్టిక్ వాడకం వద్దన్నారట. స్త్రీల సౌందర్యాన్ని మరింత తీర్చిదిద్దే కృత్రిమ పళ్లు, విగ్గులు, హీల్స్, లిప్‌స్టిక్ నేరంగా భావించేవారు.

లిప్‌స్టిక్‌లో మొదటగా ఉపయోగిచింది ఏంటంటే?

క్రీస్తు శకం 8 నుంచి 12 కాలంలో అబూ అల్ ఖాసి అల్ జహ్రావి అనే వ్యక్తి లిప్‌స్టిక్‌ను సృస్టించారు. ఫస్ట్ టైమ్ లిప్‌స్టిక్ తయారుచేయడానికి జహ్రావి పర్ఫూమ్ స్టిక్‌లను ఉపయోగించారు. ఈ పర్ఫూమ్ స్టిక్‌లను ప్రత్యేక అచ్చులో పెట్టి రెడీ చేశారట. ఇక దీన్ని 1884 లో గ్వెర్లైన్ అనే ఫ్రెంచ్ సౌందర్య కంపెనీ లిప్‌స్టిక్‌ను సిల్స్ పేపర్‌ ప్యాకేజీలో చుట్టి సేల్ చేసింది. దీన్ని తయారు చేయడం కోసం బీస్ వ్యాక్స్, ఆముదం వంటివి ఉపయోగించారు. ఇక ఈ వాణిజ్య లిప్‌స్టిక్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉండేదట.

చేసుచేసే పదార్థాలతో లిప్‌స్టిక్ తయారీ..

ఈ లిప్‌స్టిక్ ఆరోగ్యాన్ని పాడు చేసే పదార్థాలతో తయారు చేసేవారు. వైట్ లెడ్, రెడ్ కలర్ రాళ్లతో తయారు చేసేవారు. ఇవి ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. పురాతన గ్రీకు కాలంలో సెక్స్ వర్కర్లు ఉపయోగించ లిప్‌స్టిక్ రెడీ చేయడం కోసం గొర్రెల చెమట వాడేవారట. అలాగే మనుషుల ఉమ్ము, మొసళ్ల మలంతో తయారు చేసేవారట. దీంతో 1850 సంవత్సర వరకు దీని విలువ క్రమంగా తగ్గుతూ వచ్చింది.

వన్నె తరగని రంగే అదే..

లిప్‌స్టిక్ వాడకం ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నప్పటికీ ప్రస్తుత రోజుల్లో మహిళలు పెదాలకు రంగు లేనిది బయటకెళ్లడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల షేడ్స్ వచ్చాయి. కానీ ఎన్ని రంగులొచ్చిన పూర్వంలో ఎలిజబెత్ రాణి ఉపయోగించిన రెడ్ కలర్‌కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు మహిళలు. ఎన్ని రంగులొచ్చినా, కాలాలు మారినా ఎరుపు రంగు అంటే ఎప్పటికీ స్పెషలే. నలుగురిలో ఉన్నప్పుడు ఎవరి దృష్టైన సడెన్‌గా రెడ్ కలర్ వైపే వెళ్తుంటుంది.

గమనిక:గమనిక: పై సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. దీనిని దిశ ధ‌ృవీకరించలేదు. అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story