- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో వెలుగు చూసిన శిలాయుగపు చిత్రకళ వర్ణ చిత్రాలు
దిశ, వెబ్‌డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మల రామారం మండలం, ప్యారారం గ్రామంలోని చిత్తారి గుట్టపైన శిలాయుగపు నాటి చిత్రకళ బయల్పడింది. శ్రీరామోజు హరగోపాల్ నేతృత్వంలోని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, కొరవిగోపాల్, మహమ్మద్ అన్వర్ పాషా ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా.ఈమని శివనాగిరెడ్డి శనివారం ఆదిమ మానవుని వర్ణ చిత్రాలను పరిశీలించారు. స్థానికంగా చిత్తారిగుట్ట అని పిలవబడే ఒక రాతి ఆవాసపు గోడ, కప్పు భాగంలో మధ్య (సూక్ష్మ) రాతియుగం, కొత్తరాతియుగపు మూపురం ఉన్న ఎద్దు బొమ్మలు 6, ఒక అడవి పంది, రెండు జింకలు, ఇద్దరు మనుషుల బొమ్మలను గుర్తించినట్లు తెలిపారు. ఎర్రజాజు రంగుతో, రేఖా చిత్రరీతిలో గీచిన ఈ బొమ్మలు ఆనాటి మానవుల చిత్ర కళా నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయన్నారు.
చిత్తారిగుట్ట దిగువన సూక్ష్మరాతి పనిముట్లు, ఒక కొత్తరాతి యుగపు రాతి గొడ్డలి, గొడ్డళ్లను అరగదీసిన గుంటలను కూడ గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఆధారాలవల్ల ఈ వర్ణచిత్రాలు క్రీ.పూ.8000 నుంచి 4000 సంవత్సాల మధ్యకు చెందినవని తెలుస్తుందని శివనాగిరెడ్డి చెప్పారు. అదే రాతి ఆవాసంపైన చారిత్రక తొలియుగపు పూర్తిగా రంగుతో నింపిన స్త్రీ బొమ్మ, మధ్యయుగాల నాటి శృంగార భంగిమలో ఉన్న రెండు జంటల చిత్రాలు కూడా ఉన్నాయన్నారు. పురావస్తు ప్రాధాన్యతగల ఈ వర్ణ చిత్రాలను కాపాడి, భావి తరాలకు అందించాలని, చిత్తారిగుట్ట దగ్గరగల గ్రామస్తులకు శివనాగిరెడ్డి, చరిత్ర బృందం విజ్ఞప్తి చేశారు.
ఫొటోల్లో తమను తాము గుర్తిస్తున్న చేపలు..