- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ కారణంగా అందం కోల్పోయారా..? ఇవిగో చిట్కాలు!

దిశ, ఫీచర్స్ : ఉన్నంతలో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ట్రై చేస్తుంటారు. ముఖంపై ముడతలు, చర్మంపై మచ్చలు తగ్గడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. మరికొందరు బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలల్లో ఖర్చు పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఖర్చు ఎక్కువ. పైగా కొన్ని రకాల ప్రొడక్ట్స్ స్కిన్ అలర్జీలకు దారితీయవచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ముఖ సౌందర్యాన్ని పెంచుకునే మార్గాలు అనుసరించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే శరీరంలో కొల్లాజెన్ స్థాయిలు కూడా తగినంతగా ఉండాలి. ఇది శరీరాన్ని ఆరరోగ్యంగా ఉంచడంలో సహాయపడే ముఖ్యమైన ప్రొటీన్. ఇది లోపిస్తే స్కిన్ డ్రైగా మారడం, ముడతలు పడటం, కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, తరచుగా అలసట, చర్మంపై దద్దుర్లు, ఇన్‌ఫెక్షన్లు వంటివి వస్తుంటాయి. ముఖంలో షైనింగ్ కూడా లోపిస్తుంది. కాబట్టి కొల్లాజెన్ లోపానికి కారణమయ్యే ఆహారాలను అవాయిడ్ చేయాలని, పెరుగుదలకు అవసరమైన వాటిని తీసుకోవాలని చర్మ వ్యాధి నిపుణులు చెబుతున్నారు.
స్వీట్లు ఎక్కువ తినొద్దు
స్వీట్లు ఎక్కువగా తినే అలవాటు కూడా కొల్లాజెన్ లోపానికి కారణం అవుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎందుకంటే షుగర్ అణువులు రక్త ప్రవాహంలో కొల్లాజెన్ ఫైబర్లతో కలిసి పోతాయి. ఈ ప్రాసెస్‌నే గ్లైకేషన్ అంటారని నిపుణులు చెబుతున్నారు. కాగా ఇది క్రమంగా కొల్లాజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. చర్మం వదులుగా మారడం, ముడతలు, గీతలు వంటి వృద్ధాప్య ఛాయలు రావడం జరుగుతుంది.
అధిక మసాలాలు, విటమిన్ సి
ఆహారంలో అధిక మసాలాలు వాడటం కూడా బాడీలో కొల్లాజెన్ లోపానికి దారితీస్తుంది. దీంతో ముఖంపై ముడతలు పెరుగుతాయి. కాబట్టి అధిక మసాలాలు తగ్గించాలి. విటమిన్ సి లోపం కూడా కొల్లాజెన్ ఉత్పత్తి కాకపోవడానికి కారణం అవుతుంది. అందుకే సిట్రస్ పండ్లు, అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా నారింజ, నిమ్మ, ద్రాక్ష, దానిమ్మ, టమాల, ఆవకాయ వంటివి ఇందుకు సహాయపడతాయి. చర్మ సౌందర్యాన్ని పెంచడలో కీ రోల్ పోషిస్తాయి.
ప్రొటీన్ ఫుడ్స్
ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడంవల్ల కొల్లాజెన్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి చర్మ సంరక్షణకు, నిగారింపునకు దోహదం చేస్తాయి. అమైనో ఆమ్లాల ఉత్పత్తికి సహాయపడతాయి. అందుకే పాలకూర, తోటకూర, బ్రోకలీ వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటితోపాటు విటమిన్ సి, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్ అధికంగా ఉండే మష్రూమ్స్ వంటివి తినాలి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.