- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ప్రేమ జంట చాలా స్పెషల్.. వీళ్ల బస్సు మరింత స్పెషల్.. (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః ప్రేమ కథలన్నీ ఒకేలా ఉండవు. అన్నింటా స్వార్థం మాత్రమే రాజ్యమేలదు! కుటుంబం, సమాజంతోనూ ప్రేమ ముడిపడి ఉంటుంది. అంతకుమించి, ఇద్దరి ఆశయం, ఆలోచన, ఆచరణ, అన్నింటికన్నా ఆత్మతృప్తిగా బతికినప్పుడు ఆ ప్రేమకు విలువుంటుంది. అలాంటి ఓ ప్రేమ జంటే స్పూర్తివంతమైన కథే ఇది. ఇంటర్నెట్‌లో అందరి హృదయాలను గెలుచుకుంటుంది. గిరి, తారా అనే జంట ప్రస్తుతం కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సును నడుపుతున్నారు. ఇది మిగిలిన అన్ని బస్సులు లాంటిది కాదు. అలప్పుజా జిల్లాలోని హరిపాడ్ KSRTC డిపోలో స్థానికులకు ఈ బస్సు చాలా స్పెషల్. అయితే, బస్సుతో పాటు ఈ జంట ప్రేమ కూడా అంతే ఫేమస్ అక్కడ.
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను అయ్యపే వల్లికడన్ అనే యూజర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. క్లిప్‌లో ఈ స్పెషల్ బస్సు చూడొచ్చు. ఇందులో ప్రయాణీకుల భద్రత కోసం ఆరు CCTV కెమెరాలు, ఎమర్జెన్సీ స్విచ్‌లు, ప్రయాణికుల సౌకర్యార్థం మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎయిర్ ఫ్రెషనర్, పిల్లలను అలరించడానికి బొమ్మలు, అలంకరణలు మరియు వాహనంలో LED డెస్టినేషన్ బోర్డ్‌ను అమర్చారు. గిరి, తారా తమ సొంత జేబుల నుండి డబ్బు ఖర్చు చేసి ఈ బస్సును చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇలా చేసినందుకు వీరికి చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. దీనికి ఎంత క్రేజ్ అంటే, ఈ బస్సులో నిత్యం ప్రయాణించే ప్రయాణికులు వివిధ వాట్సాప్ గ్రూపులను కూడా ప్రారంభించారు.
ఇక బస్సు పట్ల వీళ్లద్దరి కమిట్మెంట్‌ను వింటే విస్తుపోవాల్సిందే! "ప్రతిరోజూ మేము తెల్లవారుజామున 1.15 గంటలకు లేచి 2 గంటలకు డిపోకు చేరుకుంటాము. గిరి బస్సును శుభ్రం చేస్తాడు. మా డ్యూటీ ఉదయం 5.50 గంటలకు ప్రారంభమవుతుంది," అని తారా చిరునవ్వుతో తమ రోజువారీ పనిని చెబుతుంది. అయితే, వారి కథ ఇక్కడితో ముగియలేదు. వాస్తవానికి, ఇటీవలే వివాహం చేసుకున్న తార, గిరిల మధ్య 20 ఏళ్లకు పైగా ప్రేమ కథ నడిచింది. గిరికి 26 ఏళ్లు, తారాకు 24 ఏళ్ల వయసులో కలుసుకున్నారు. వారి వివాహం దాదాపుగా ఖాయం అయింది కానీ వారి జాతకాలు సరిపోలకపోవడంతో చాలా ఆలస్యం అయ్యింది. అయితేనేమీ, ఆనందంగానే జీవించారు. చివరికి, ఇటీవల కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో వాళ్లు వివాహం చేసుకున్నారు. వీళ్ల జీవితం రైట్.. రైట్ అంటూ సాఫీగా సాగిపోతూనే ఉంది.. ఎంతో స్పెషల్‌గా..!