Health Tips : వర్షాకాలంలో స్టమక్ ఇన్ఫెక్షన్లకు కారణం అదే.. ఏం చేయాలంటే..

by Javid Pasha |
Health Tips : వర్షాకాలంలో స్టమక్ ఇన్ఫెక్షన్లకు కారణం అదే.. ఏం చేయాలంటే..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగానే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రభావం అధికంగా ఉంటుంది. అపరిశుభ్రత, దోమల సంఖ్య పెరుగుదల కారణంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటివి వ్యాపిస్తుంటాయి. వీటితోపాటు ఎన్నడూ లేని హెల్త్ ఇష్యూస్ కూడా తలెత్తుతుంటాయి. అలాంటి వాటిలో స్టమక్ పెయిన్ కూడా ఒకటి. వర్షాకాలంలోనే కొందరిని ఈ సమస్య వేధించడానికి ప్రత్యేక కారణాలు ఉండవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏంటో చూద్దాం.

* వర్షాకాలంలో కడుపునొప్పి సమస్యలు పెరగానికి ప్రధాన కారణం కలుషిత నీరు, కలుషిత ఆహారమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వానలు పడటంవల్ల నేలపై ఉండే మురుగు, చెత్తా చెదారం కొట్టుకుపోయి ఎక్కడో ఒక దగ్గర పేరుకుపోతుంటాయి. అక్కడ దోమలు, ఈగలు పెరుగుతాయి. అక్కడి నుంచి ఇండ్లల్లోకి, రెస్టారెంట్లలోకి వచ్చిన ఈగలు, దోమలు ఆహారంపై వాలడం కారణంగా కంటికి కనిపించని సూక్ష్మ జీవులు, బ్యాక్టీరియాలు ఆహారాలపైకి చేరుతాయి. వాటిని తినడంవల్ల కడుపునొప్పి రావచ్చు.

* అలాగే తరచుగా ముసురు కురిస్తే గుంతల్లో, మురుగు కాల్వల్లోని నీరు భూగర్భంలోకి ఇంకి మంచినీటి వనరుల్లో కలిసిపోతుంది. ఇది నీటి కాలుష్యానికి కారణం అవుతుంది. అందుకే కాచి చల్లార్చిన నీరు తాగాలని చెప్తుంటారు ఆరోగ్య నిపుణులు. అలా చేయకపోతే అనారోగ్యాలు రావచ్చు. ముఖ్యంగా చిన్నారుల్లో డయేరియా, ఇన్ ఫ్లూయెంజా, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు పెరిగే చాన్సెస్ ఎక్కువ. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా సమస్యను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

* వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యల నివారణలో భాగంగా కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏంటంటే.. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. దీనివల్ల నీటిలో ఇన్ఫెక్షన్లకు కారణం అయ్యే బ్యాక్టీరియాలు నశిస్తాయి. ముఖ్యంగా ట్యాప్ వాటర్ ఉపయోగించేవారు తప్పకుండా ఈ పనిచేయాలి. అలాగే తీసుకునే ఆహారంలోనూ కేర్ తీసుకోవాలి. వీలైనంత వరకు బయటి నుంచి తెచ్చే ఆహారాలు, చిరుతిళ్లు తీసుకోకపోవడం చాలామంచిది. ఇంటిలో వండినవి తినడం శ్రేయస్కరం. అయితే ఇండ్లల్లో కూడా మిగిలిన ఆహారాన్ని మరుసటి రోజు తినడం వంటివి చేయకూడదు. ఇక స్టమక్ ఇన్ఫెక్షన్లు వంటివి ఉన్నవారు లైట్‌ ఫుడ్ మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. దీనివల్ల డీహైడ్రేషన్ ప్రాబ్లం తలెత్తి ప్రాణాల మీదకు రావచ్చు. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ముందు డాక్టర్లను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed