- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Warning Signs : నిద్రలేవగానే వికారంగా అనిపిస్తోందా..? ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే!
దిశ, ఫీచర్స్ : పొద్దున్న లేవగానే వికారంగా అనిపిస్తోందా..? వాంతులు వచ్చిన అనుభూతి కలుగుతోందా ? వారం రోజులు అదే కంటిన్యూ అయితే గనుక అనుమానించాల్సిందే. ఎందుకంటే శరీరంలో డయాబెటిస్ ప్రాంరంభమైతే కూడా ఇలాంటి లక్షణాలు లేదా సంకేతాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా ఏయే లక్షణాలు మధుమేహానికి సంకేతమో, ఎలాంటి ప్రభావం చూపుతాయో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
కళ్లు మసకబారడం
ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో దాదాపు 10 కోట్లమంది డయాబెటిస్ బాధితులు ఉన్నారు. ఒకప్పుడు ఏజ్‌బార్ అయిన వారిలోనే ఇది ఎక్కువగా కనిపించేది. కానీ ప్రజెంట్ వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సైలెంట్ కిల్లర్‌గా మారుతోంది. అయితే ఉదయంపూట కనిపించే కొన్ని లక్షణాల ద్వారా దీనిని ముందుగానే గుర్తించవచ్చు. ముఖ్యంగా నిద్ర మేల్కొన్నాక వెంటనే కళ్లు సరిగ్గా కనిపించవు లేదా కళ్లు మసక బారినట్లు అనిపిస్తుంది. కొన్నిరోజులు ఇలాంటి దృష్టిలోపాలు కంటిన్యూ అయితే గనుక మీ శరీరంలో చక్కెరస్థాయిలు పెరిగి ఉండవచ్చు అంటున్నారు నిపుణులు.
నోరు తడారిపోవడం
సాధారణంగా పొద్దున్న దాహం వేయడం చాలా అరుదు. కానీ నిద్రలేవగానే నోరు తడారి పోవడం, అధికంగా దాహం వేయడం మీలో కనిపిస్తే అది డయాబెటిస్ ప్రారంభ సంకేతం కావచ్చు. ఇలాంటప్పుడు వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్‌ను చెక్ చేయించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే ఉదయం పూట కాళ్లు, చేతులు నిమిషం కంటే ఎక్కుసేపు తిమ్మిరి పట్టడం, అప్పుడప్పుడూ మూర్ఛ వంటివి రావడం కూడా మీ శరీరంలో డయాబెటిస్ డెవలప్ అవుతోంది లేదా అయిందనడానికి సంకేతాలుగా పేర్కొంటున్నారు నిపుణులు. లక్షణాల నిర్ధారణ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.