Health tips : అలసటను పెంచుతున్న ఐరన్ లోపం.. ఇలా చేస్తే ఒక్క వారంలోనే కవర్ చేయొచ్చు!

by Javid Pasha |
Health tips : అలసటను పెంచుతున్న ఐరన్ లోపం.. ఇలా చేస్తే ఒక్క వారంలోనే కవర్ చేయొచ్చు!
X

దిశ, ఫీచర్స్ : మీకు తరచుగా అలసటగా అనిపిస్తున్నదా..? శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా..? శరీరం పాలిపోయినట్లుగా కనిపిస్తోందా? అయితే మీ శరీరంలో ఐరన్ శాతం తక్కువగా ఉందని అర్థం. ఈ పరిస్థితినే ‘ఐరన్ డెఫినిషియన్సీ ఎనీమియా’ అంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రస్తుతం దీని కారణంగా ప్రపంచ జనాభాలో 30 శాతం మంది రక్తహీనతను ఎదుర్కొంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది. ఇంతకీ బాడీలో ఐరన్ లోపం వల్ల కనిపించే లక్షణాలేవి? ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.

ఐరన్ లోపం లక్షణాలు

*చిన్న చిన్న పనులకే అలసిపోవడం

*ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది

*గుండె వేగంగా కొట్టుకోవడం

*చర్మం పాలిపోవడం

*తలనొప్పి, తలతిరుగడం, చిన్న పనికే మైకం వచ్చి పడిపోవడం

*తల దువ్వినప్పుడు జుట్టు రాలడం

*నాలుకపై వాపు లేదా నొప్పి కలగడం

* గోర్లు పెళుసుగా మారడం

ఎలా తగ్గించుకోవాలి?

ఐరన్ లోపాన్ని వివిధ ఆహారాలను తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా మటన్ లేదా చికెన్ లివర్, గుడ్లు, చేపలు, లీఫ్ క్యాబేజీ, పాలకూర, తోటకూర, బచ్చటి కూర వంటి ఆకు కూరలు, చిక్కుళ్లు, బీన్స్ వంటి కూరగాయలు రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ఐరన్ లభిస్తుంది. అంతేకాకుండా బ్రేక్‌ఫాస్ట్‌లో తృణ ధాన్యాలు తీసుకోవడం, ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల కూడా శరీరంలో ఐరన్ శాతం పెరుగుందని నిపుణులు సూచిస్తున్నారు.

కాఫీకి నో చెప్పండి!

బాడీలో ఐరన్ లోపాన్ని అధిగమించడంలో మీరు తీసుకునే పానీయాలు, ఆహారాలు కూడా ప్రభావం చూపుతాయి. వాటిని తయారు చేసే పద్ధతి సైతం ఐరన్‌ను గ్రహించడంపై ఎఫెక్ట్ చూపుతుంది. అయితే కొందరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కాఫీని చేర్చుకుంటారు. కానీ ఇలా చేయడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల శరీరం ఐరన్‌ శాతాన్ని తక్కువగా గ్రహిస్తుంది. ఎందుకంటే కాఫీలో ‘ఫాలీఫినోల్స్’ అనే రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. అవి ఆహారంలోని ఐరన్‌ను కొంత వరకు నిరోధించేలా చేస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed