- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శిశువులకు తల్లిపాలు సరిపోవడం లేదా... బాలింతలు ఒక్కసారి ఈ టిప్స్ ఫాలో అయి చూడండి..
దిశ, వెబ్‌డెస్క్ : తల్లిపాలు బిడ్డకు అలాగే తల్లికి చాలా ముఖ్యం. దీంతో చిన్నారుల ఎదుగుదలతో పాటు మహిళలు కూడా అనేక సమస్యల నుంచి గట్టెక్కుతారు. అయితే చాలా మంది మహిళల శరీరం తల్లిపాలను ఎక్కువగా ఉత్పత్తి చేయదు. తల్లిపాలను పెంచడానికి ఆమె మందులు, సప్లిమెంట్ల సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తల్లి ఆరోగ్యానికి చాలా హానిని కూడా కలిగిస్తుంది. అలా కాకుండా ఆరోగ్య నిపుణుల సూచనలతో పాటు ఉత్తమమైన ఇంటి చిట్కాలద్వారా తల్లి పాలను పెంచుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భిణులు, బాలింతలు మెంతికూర, అశ్వగంధ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది పాల ఉత్పత్తికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే అవకాడోలు, మొలకలు, గింజలను తినడం ద్వారా పాల ఉత్పత్తి పెరిగే ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. అంతే కాదు బాలింతలకు, గర్భిణులకు తగినంత నిద్ర అవసరం. అలాగే ఒత్తిడి లేకుండా ఉండటం కూడా పాల ఉత్పత్తికి దోహదం చేస్తుందంటున్నారు. యోగా, ధ్యానం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే పసిపిల్లలకు ఫీడింగ్ చేయించే సమయంలో శిశువును సరైన స్థితిలో ఉంచడం వల్ల పాల ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందంటున్నారు. నడక వంటి తేలికపాటి వ్యాయామం శరీరాన్ని చురుకుగా ఉంచి పాల ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుందంటున్నారు.
రెగ్యులర్ మెడికల్ చెకప్‌లు..
బాలింతలు ఏదైనా నిర్దిష్ట సమస్యను ఎదుర్కొంటుంటే వైద్యునితో రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. తద్వారా ఏవైనా అంతర్లీన సమస్యలు ఉంటే గుర్తించి వెంటనే వైద్యం తీసుకోవచ్చంటున్నారు. అలాగే సమతుల్య, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు ఈ చర్యలను పాటించడం ద్వారా తల్లిపాల ఉత్పత్తిని పెంచవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.