ప్రతి రోజూ ఉడక బెట్టిన గుడ్డు తింటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి!

by Jakkula Samataha |
ప్రతి రోజూ ఉడక బెట్టిన గుడ్డు తింటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి!
X

దిశ, ఫీచర్స్ : గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు తినాలని చెబుతుంటారు. ఎందుకంటే దీనిలొ ఉండే పోషకాలు మనలో రోగ నిరోధక శక్తిని పెంచి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. అయితే ప్రతి రోజూ గుడ్డు తినడం మంచిదేనా? ఇలా క్రమం తప్పకుండా గుడ్డు తినడం వలన ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. దీని వలన తక్షణ శక్తి లభించడమే కాకుండా, రోజంతా ఫుల్ ఎనర్జటిక్‌గా ఉంచుతుందంట. అదే విధంగా, రోజూ క్రమం తప్పకుండా గుడ్డు తినడం వలన మన గుండె ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు నిపుణులు. దీని వలన గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందంట. అంతే కాకుండా ఇది ఎముకల బలానికి మేలు చేస్తుందంట. గుడ్డులోని పచ్చసొనలోని విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఎముకలను, దంతాలను బలంగా చేస్తుందంటున్నారు నిపుణులు. అదే విధంగా రోజూ గుడ్డు తినడం వలన కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. మానసికంగా ధృఢంగా ఉండగలుగుతారు. బరువు పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకే వైద్యులు ప్రతి రోజూ ఎగ్ తినమని చెబుతారు. ముఖ్యంగా బాలింతలు, చిన్న పిల్లలు క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఒక ఎగ్, గ్లాస్ పాలు తీసుకోవాలంట. దీని వలన పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పిల్లల్లో ఎదుగుదల కూడా బాగుంటుంది. అందుకే ప్రతి రోజూ ఉడక బెట్టిన కోడి గుడ్డు తినాలి.

Advertisement

Next Story

Most Viewed