నల్ల మిరియాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో తెలుసా..?

by Jakkula Mamatha |
నల్ల మిరియాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: మనుషులను నిత్యం వేధించే వ్యాధుల్లో జలుబు ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా ఇది చలికాలంలో ఎక్కువగా వెంటాడుతుంది. మరికొందరిలో కాలంతో పనిలేకుండా చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఎవరైనా జ్వరం, దగ్గు, తలనొప్పి ఇలా ఏ రకమైన వ్యాధి వచ్చినా తట్టుకోగలుగుతారు కానీ, జలుబు నుంచి వెంటనే కోలుకోలేరు. ఒక్కోసారి ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా ప్రయోజనం ఉండదు. ఇలాంటి సమయంలో చిన్న చిన్న చిట్కాలతో ఇంట్లోనే జలుబును మాయం చేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జలుబు నుంచి ఉపమశమనం పొందేందుకు నల్ల మిరియాలు ఎంతో ఉపయోగపడుతాయి.

వీటిలో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ కె ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉపయోగపడుతాయి. ఈ నల్ల మిరియాలను పొడి చేసి అందులో కాసింత బెల్లం, లేదా తేనేను ఒక గ్లాసు నీటిలో కలుపుకొని కషాయంలా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలని.. కాస్త ఘాటుగా ఉన్నా ఇబ్బంది పడకుండా తీసుకుంటే ఇది ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఈ కషాయన్ని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల దగ్గు, గొంతు, కీళ్ల నొప్పుల సమస్య ఉండదు. అలాగే నాలుగు చెంచాల ఉల్లిపాయ రసంలో అరచెంచ మిరియాల పొడి వేసి తీసుకోవడం వల్ల వికారం, వాంతులు తగ్గుతాయి. ఈ విధంగా నల్ల మిరియాలు శరీరానికి ఎంతో ఉపశమనాన్నీ ఇస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed