ఇతడేం చేయడు.. కానీ, లక్షల్లో సంపాదన.. ఎలాగో తెలుసుకోండి!

by D.Reddy |   ( Updated:2025-03-19 15:00:38.0  )
ఇతడేం చేయడు.. కానీ, లక్షల్లో సంపాదన.. ఎలాగో తెలుసుకోండి!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో ప్రతిదానికి డబ్బు (Money) కావాల్సిందే. ఇక మనకు నచ్చినట్లుగా లైఫ్ లీడ్ చేయాలంటే స్థిరమైన సంపాదన ఉండాలి. అందుకోసం మనలో చాలా మంది నిరంతరం కష్టపడుతుంటాం. కానీ, జపాన్‌కు (Jepan) చెందిన ఓ వ్యక్తి మాత్రం అసలు ఎలాంటి కష్టం లేకుండా ఏ పని చేయకుండానే లక్షల్లో సంపాదిస్తున్నాడు. అలా అని అతనేదో పెద్ద వ్యాపార్తవేత్త కాదు. తాతముత్తాలు సంపాదించిన ఆస్తులు లేవు. మరెలాగో తెలుసుకోవాలనుందా? మీకోసమే ఈ స్టోరీ.

జపాన్‌కు చెందిన షోజి మోరిమోటో (Shoji Morimoto) అనే 41 ఏళ్ల వ్యక్తి ఎలాంటి శారీరక శ్రమ లేకుండా లక్షల్లో సంపాదిస్తున్నాడు. 2018లో తను ఉద్యోగం కోల్పొయాడు. ఆ తర్వాత ఉద్యోగం దొరకపోవటంతో తనను తాను అద్దెకు ఇచ్చుకునే బిజినెస్ ప్రారంభించాడు. అంటే.. ఎవరైనా తనను అద్దెకు తీసుకోవచ్చు. తన సమయాన్ని మరొకరి కోసం వెచ్చించి అందుకు బదులుగా వారి వద్ద నుంచి సర్వీస్ చార్జ్ తీసుకుంటాడు.

ఎవరైనా ఒంటరిగా బాధపడుతున్నప్పుడు వారిని ఓదార్చటం, ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు తోడుగా వెళ్లటం, తమ క్లయింట్స్ తరపున లైన్లలో నిలబడటం, ఒంటరిగా ఉన్న వారితో సరదాగా ముచ్చటించడం, వారితో కలిసి భోజనం చేసేందుకు ఇలా రకరకాల పనులకు షోజిని బుక్ చేసుకుంటారు. ఇలా ప్రతిరోజూ తన మొబైల్‌‌కు 1000 మందికి పైగా అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ కూడా వస్తాయంటే అర్థం చేసుకోవచ్చు షోజి డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందని. ఇక ఒక్క సెషన్‌కు 65 నుంచి 195 డాలర్లు వసూలు చేస్తాడు. ఈ సెల్ఫ్ రెంటల్ బిజినెస్‌తో షోజి కేవలం ఏడాదిలో 80,000 డాలర్లు సంపాదిస్తున్నాడు.

Read More..

టెక్నాలజీని వాడుకున్న రామచిలుక.. యజమానికి ఊహించని షాక్

Next Story