మీ కలలో పగిలిన గాజు కనిపించిందా.. అయితే, జరిగేది ఇదే!

by Prasanna |
మీ కలలో పగిలిన గాజు కనిపించిందా.. అయితే, జరిగేది ఇదే!
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా మనకి ఎన్నో కలలు వస్తుంటాయి. వాటిలో కొన్ని మంచి కలలు అయితే, మరి కొన్ని మనల్ని బాధ పెట్టె విధంగా ఉంటాయి. గాఢ నిద్రలోకి మనిషి వెళ్లినప్పుడు ఎన్నో కలలు కంటాడు. ప్రతి కలకి వేరే అర్థం ఉంటుంది. తెల్లవారుజామున కనిపించే కలలు నిజమవుతాయని జ్యోతిష్యులు కూడా చెబుతున్నారు. ఈ కలలు కొన్నిసార్లు భవిష్యత్ సంఘటనలను సూచిస్తాయి. మీరు మీ కలలో పగిలిన గాజును చూస్తే, దానికి అనేక అర్థాలు ఉంటాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతి ఒక్కరికి కలలు ఒకేలా రావు. కొని సార్లు చూడకూడని సంఘటనలు కూడా కలలో చూస్తుంటాము. అలాంటి వాటిలో ఈ కల కూడా ఒకటి. మీరు మీ కలలో విరిగిన గాజును చూసినట్లయితే, వారికి అశుభంగా ఉంటుందట. అంతే కాకుండా, కష్టమైన రోజులు గురించి ముందే హెచ్చరిక అట. కలలో విరిగిన అద్దం గురించి కల పుస్తకం ఏమి చెబుతుందో తెలుసుకుందాం.

స్త్రీలు కలలో పగిలిన అద్దం కనిపిస్తే, చుట్టుపక్కల వారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ కల తరచుగా జీవితంలో ముఖ్యమైన సంఘటనలకు ముందు వస్తుంది. కలలో విరిగిన గాజును చూడటం ప్రతికూల సంకేతం. బంధువు మరణ వార్త, మానసిక వేదన, శోకం యొక్క కన్నీళ్లను సూచిస్తుంది. ఇది మీకు దగ్గరగా ఉన్న వ్యక్తిని దూరం చేస్తుంది. కాబట్టి ఎవరితోనూ గొడవలు వెళ్లకండి. మీరు కలలో విరిగిన గాజును పట్టుకుంటే, ఇది ముఖ్యమైన మార్పులను సూచిస్తుంది. మీరు మీ ప్రతిబింబం నవ్వుతూ లేదా సంతోషంగా ఉన్నట్లు చూస్తే, అది సానుకూల మార్పుకు సంకేతం.

Advertisement

Next Story

Most Viewed