secrets : భాగస్వాములైనా సరే.. ఈ విషయాల్లో సీక్రెట్ మెయింటైన్ చేస్తారట!

by Javid Pasha |
secrets : భాగస్వాములైనా సరే.. ఈ విషయాల్లో సీక్రెట్ మెయింటైన్ చేస్తారట!
X

దిశ, ఫీచర్స్ : ఎంత సన్నిహితులైనా సరే, చివరికి ప్రేమికులు, భార్యా భర్తలు అయినప్పటికీ ఒకరికొకరు చెప్పుకోని విషయాలు కూడా ఉంటాయని రిలేషన్‌షిప్ నిపుణులు అంటున్నారు. అంతేకాదు జీవితంలో ప్రతి ఒక్కరూ తమకంటూ పర్సనల్ స్పేస్, పర్సనల్ ఓపీనియన్స్, పర్సనల్ ఫీలింగ్స్ కలిగి ఉంటారు. భార్యా భర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండవని కొందరు చెప్తుంటారు. కానీ వాస్తవానికి చాలామంది సీక్రెట్స్ మెయింటెన్ చేస్తుంటారని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అలా చేయకపోతే సమస్యలు రావచ్చు. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఆర్థిక విషయాలు

ఎంత క్లోజ్ అయినప్పటికీ చాలామంది తమ ఆర్థిక పరమైన లావా దేవీలను, సమస్యలను పంచుకోరు. అలా చేస్తే ఇబ్బందులు తలెత్తవచ్చు. అలాగే తక్కువ సంపాదన, తక్కువ నైపుణ్యాల గురించి కూడా అవతలి వ్యక్తితో షేర్ చేసుకోవడంవల్ల చులకనకు గురయ్యే చాన్సెస్ ఉంటాయని చాలా మంది చెప్పుకోరు. భార్యా భర్తలు కూడా డబ్బు సంపాదన, ఖర్చులు వంటి ఆర్థిక విషయాల్లో చిన్నవో పెద్దవో సీక్రెట్స్ అయితే మెయింటెన్ చేస్తారట.

ఓల్డ్ రిలేషన్‌షిప్స్

పెళ్లికి ముందు ప్రేమ, పర్సనల్ రిలేషన్‌షిప్స్ వంటివి ఈరోజుల్లో కామన్ అయిపోయింది. కొన్నాళ్ల అనుబంధం తర్వాత ఏదో కారణాలవల్ల విడిపోయి, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి రావచ్చు. అయితే ఇలాంటప్పుడు మ్యారేజ్ తర్వాత స్త్రీ గానీ, పురుషుడు గానీ గత సంబంధాలను, ప్రజెంట్ సంబంధంలో ఉన్న వ్యక్తితో ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేసుకోరు. అలా చేస్తే అపార్థం చేసుకుంటారని, కుటుంబంలో లేనిపోని గొడవలు వస్తాయని, బంధాలు దూరం అవుతాయని భయపడేవారే ఎక్కువ మంది ఉంటారని నిపుణులు చెప్తున్నారు.

ఫ్యామిలీ ఇష్యూస్

కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకపోవడం మానసిక ప్రశాంతతను ఇస్తుందని అందరూ భావిస్తుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో గొడవలో, ఆరోగ్య సమస్యలో, ఆర్థిక ఇబ్బందులో వస్తుంటాయి. ఇవి కుటుంబ భారాన్ని మోస్తున్న వ్యక్తిని ఒత్తిడికి గురిచేస్తాయి. అయినప్పటికీ మనసులోని మాటను చాలా వరకు భాగస్వామితో పంచుకోరని, అవతలి వ్యక్తిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని తమలో తామే బాధపడుతుంటారని నిపుణులు పేర్కొంటున్నారు.

సోషల్ మీడియాలో ఏం చూస్తారు?

ఈరోజుల్లో చాలామంది సోషల్ మీడియా ఎకౌంట్ కలిగి ఉంటున్నారు. ఇతరులను ఫాలో అవుతుంటారు. అయితే కొందరు అన్యో్న్యంగా ఉండే జంటలను చూసి వారితో పోల్చుకోవడం, అసూయ చెందడం, మరి కొందరు హ్యాపీగా ఫీలవడం వంటివి కూడా చేస్తుంటారు. కానీ ఈ విషయాలు షేర్ చేసుకోరు. అలాగే తరచుగా తాము ఎలాంటి అంశాలను, వీడియోలను స్ర్కోల్ చేస్తారనేది కూడా స్త్రీ గానీ, పురుషుడు గానీ తమ భాగస్వామికి దాదాపుగా చెప్పరు. విషయం ఏంటంటే.. రహస్యాలను షేర్ చేసుకోవడంవల్ల కొన్ని సందర్భాల్లో బంధాలు విచ్ఛిన్నం కావచ్చు. కాబట్టి ఇబ్బందులకు గురిచేసే సీక్రెట్స్‌ను పంచుకోకపోవడమే మంచిదని పెద్దలు, నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అందులోని విషయాలను ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story