- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hair health: బియ్యం కడిగిన నీటితో తెల్లజుట్టు సమస్యకు చెక్.. ఏం చేయాలంటే..
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం జుట్టు తెల్లబడటం, జుట్టు రాలే సమస్య చాలా మందిని వేధిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు మొదలు కొని పెద్ద మనుషుల వరకు తలపై తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. అయితే వాటిని కవర్ చేయడానికి చాలామంది హెయిర్ కలర్స్ వాడుతుంటారు. కానీ తరచుగా రంగు వేయడం దీర్ఘకాలంపాటు కొనసాగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, కంటి చూపు మందగించే అవకాశం లేకపోలేదని ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే బియ్యం కడిగిన నీళ్లు, ఆముదం నూనె కలిసిన మిశ్రమంతో అలాంటి ఇబ్బందులు లేకుండానే తెల్లజుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చునని చెప్తున్నారు. అదెలాగో చూద్దాం.
బియ్యం కడిగిన నీళ్లు, ఆముదం నూనె కాంబినేషన్ తెల్ల జుట్టు నివారణకు, జుట్టు సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది అంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. ఈ రెండింటి మిశ్రమాన్ని జుట్టుపై స్ర్పే చేసి, సున్నితంగా మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉటుందట. అయితే జుట్టుకు వాడే బియ్యపు నీటిని ముందుగానే బియ్యాన్ని నానబెట్టడం పులియబెట్టడం లేదా ఉడక బెట్టడం వంటి ప్రాసెస్ ద్వారా తయారు చేసుకోవచ్చునని చెప్తున్నారు. ఆ తర్వాత దానిని ఒక స్ర్పే బాటిల్లో స్టోర్ చేసుకొని అందులో నాలుగైదు చుక్కల ఆముదం నూనె కలిపి జుట్టుకు అప్లయ్ చేస్తే కొన్ని రోజులకు జుట్టు నల్లగా కనిపిస్తుంది. బియ్యపు నీటిలో ఉండే బి, సి, ఇ, కె, విటమిన్లు ఇలా జుట్టు నల్లబడటంలో సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు. అలాగే వీటిలోని అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని, చుండ్రు సమస్యను, దురదను నివారించడంలో సహఆయపడతాయి.
ఎలా తయారు చేయాలి?
బియ్యపు నీటిని తయారు చేయడం చాలా ఈజీ. గిన్నెలో ఒక గ్లాసు బియ్యం తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో రెండు గ్లాసుల నీటిని పోసి పక్కన పెట్టాలి. ఓ అరగంట లేదా గంట తర్వాత ఆ బియ్యాన్ని వడకట్టి, గాలి చొరబడని బాటిల్లో బియ్యపు నీటిని స్టోర్ చేయాలి. ఆ నీటిని ఆ రోజంతా లేదా రాత్రంతా అలాగే ఉంచాలి. తర్వాత ఒక స్ప్రే బాటిల్లో పోసి, ఒక టీ స్పూన్ లేదా నాలుగైదు చుక్కల ఆముదం నూనె కలపాలి. ఇక ఆ మిశ్రమాన్ని తరచుగా జుట్టుపై స్ర్పే చేస్తూ.. సున్నితంగా మాసాజ్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకు తెల్లజుట్టు క్రమంగా నల్లగా కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. జుట్టు ఆరోగ్యం విషయంలో నిర్ణయం తీసుకునే ముందు నిపుణులను సంప్రదించగలరు.