గిన్నిస్ రికార్డ్: ఈ టీ పాట్ ధర రూ. 24 కోట్లు.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా..?

by sudharani |
గిన్నిస్ రికార్డ్: ఈ టీ పాట్ ధర రూ. 24 కోట్లు.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: టీ పోసుకునే జార్ లాంటి పాట్‌ని టీ పాట్ అంటారు. దీని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అందరికీ అందుబాటులో దొరికే వస్తువు. దీని విలువ రూ. 100 నుంచి రూ. 1000 మధ్యలో ఉంటుంది. ఏదైనా స్పెషల్ డిజైన్ లాంటిది కావాలనుకుంటే ఇంకాస్త డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. అంతేకానీ.. ఓ టీ పాట్ ధర రూ. 24 కోట్లు ఉంటుందని ఎవరూ ఊహించరు. ఏంటి షాక్ అయ్యారా..? మీరు విన్నది నిజమే. ఒక టీ పాట్ ధర అక్షరాలా రూ. 24 కోట్లు. ఎందుకు ఇంత ధర.. దీనిలో ప్రత్యేకత ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం.

ఈ టీ పాట్‌ను ‘ది ఇగోయిస్ట్’ అని పిలుస్తారు. బ్రిటన్‌కు చెందిన ఎన్‌ సేథియా ఫౌండేషన్, లండన్‌లోని న్యూబీటీస్ తయారు చేయించిన ఈ టీ పాట్‌ను.. ఇటాలియన్‌ ఆభరణాల వ్యాపారి ఫుల్వియో స్కావియా అత్యద్భుతంగా రూపొందించారు. ఈ టీ పాట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గిన్నిస్ బుక్ గుర్తించింది. ఈ మొత్తం టీ పాట్ తయారీలో 1658 వజ్రాలు, 386 ప్రామాణికమైన థాయ్, బర్మీస్ కెంపులు ఉపయోగించారు. అయితే 2016లోనే దీని విలువ రూ. 24 కోట్లు ఉండగా.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీపాట్‌గా గిన్నిస్ బుక్ తాజాగా గుర్తించింది.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ నోట్ రిలీజ్ చేసింది. ‘‘ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన టీ పాట్. UK లోని ఎన్ సేథియా ఫౌండేషన్ యాజమాన్యంలో, టీ పాట్ 18-క్యారెట్ పసుపు బంగారంతో తయారు చేయబడింది. ఇది మొత్తం బాడీ కప్పి ఉంచే కట్ డైమండ్, మధ్యలో 6.67-క్యారెట్ రూబీతో తయారు చేయబడింది. టీ పాట్ యొక్క హ్యాండిల్ శిలాజ మముత్ ఐవరీ నుండి తయారు చేయబడింది. దీని విలువ 2016లో $3,000,000 (£2,307,900, €2,704,800)గా నిర్ణయించబడింది’’ అంటూ ట్వీట్ చేసింది. ఈ టీ పాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story

Most Viewed