- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాల్ కోసం బాబు.. స్మార్ట్‌గా కాపాడిన సూపర్ డాగ్! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః కుక్కకున్న విశ్వాసం మనుషులకు ఉండదంటారు. నిజమే..! నమ్మిన వాళ్లే ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో, ఇంట్లో చంటి పిల్లలపైనే అత్యాచారాలకు పాల్పడుతున్న విశ్వాసఘాతకుల మధ్య కుక్క చాలా గొప్ప జీవి అనే చెప్పాలి. కుక్కలు అంత విశ్వాసపాత్రమైనవి కాబట్టే మనిషితో వాటికి అంతటి అవినావభావ సంబంధం ఏర్పడింది. ఇది నిజమంటూ రుజువుచేసే మరో వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఓ ఇంటి పెంపుడు కుక్క జర్మన్ షెపర్డ్, పెరట్లో ఉన్న నీటి కుంటలో పడిపోతున్న బాలుడిని స్మార్ట్‌గా కాపాడుతున్న వీడియో ఇది.
ఈ వీడియో క్లిప్‌లో, ఇద్దరు పిల్లలు పెరట్లో ఆడుకుంటుండగా జర్మన్ షెపర్డ్ కూర్చొని చూస్తూ ఉంటుంది. పొరపాటున పిల్లలాడుకునే బంతి చేపల కుంటలో పడుతుంది. ఇద్దరి పిల్లల్లో పెద్దదైన అమ్మాయి వెంటనే సహాయం కోసం పెద్దవారిని పిలవడానికి ఇంటి లోపలికి పరిగెత్తుతుంది. కానీ బాలుడు వంగి నీటి కుంటలో బంతిని తీయడానికి ప్రయత్నిస్తుంటాడు. ప్రమాదాన్ని పసిగట్టిన కుక్క అతని వైపు పరుగెత్తి, టీ-షర్ట్‌ని తన పళ్ళతో పట్టుకుని, పిల్లవాడిని నీటిలో పడకుండా వెనక్కి లాగుతుంది. పక్కనున్న నెట్‌తో నీటిలో ఉన్న బంతిని బయటకు తీస్తుంది. పిల్లల పట్ల కుక్కకున్న శ్రద్ధ, ముఖ్యంగా దాని తెలివితేటలు చూసి నెటిజన్ల ప్రశంసిస్తున్నారు. డాగ్ లవర్స్ తెగ షేర్ చేస్తున్నారు.