Diabetes : షుగర్ తక్కువగా ఉండే ఫ్రూట్స్.. ఇవి తింటే మధుమేహం కంట్రోల్లోకి వచ్చినట్లే!

by Javid Pasha |   ( Updated:2024-11-11 15:50:46.0  )
Diabetes : షుగర్ తక్కువగా ఉండే ఫ్రూట్స్.. ఇవి తింటే మధుమేహం కంట్రోల్లోకి వచ్చినట్లే!
X

దిశ, ఫీచర్స్ : మనం తినే ఆహారాలను బట్టి కొన్ని వ్యాధులు ప్రభావితం అవుతుంటాయి. ఎక్కువ కావడమో, కంట్రోల్లో ఉండటమో జరగవచ్చు. అలాంటి వాటిలో మధుమేహం కూడా ఒకటి. సరైన ఆహార నియమాలు పాటించకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల డయాబెటిస్ రిస్క్ అధికం అవుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవడంవల్ల దీనిని అదుపులో ఉంచుకునే చాన్స్ ఉంది. అవేంటో చూద్దాం.

*బెర్రీలు : షుగర్ కంటెంట్ తక్కువగా ఉండే పండ్లల్లో స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు, బ్లూ బెర్రీలు ప్రముఖంగా ఉన్నాయి. రుచిగా కూడా ఉండే ఈ పండ్లలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్, కార్బొహైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని డయాబెటిస్ బాధితులు తినవచ్చు. పైగా ఇవి స్వీట్స్ తినాలనే కోరికను కూడా తగ్గిస్తాయట.

* యాపిల్ : యాపిల్స్‌లో కూడా చక్కెర స్థాయిలు చాలా తక్కువ. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉండటంతో షుగలర్ లెవల్స్ పెరుగుతుందన్న భయం లేదంటున్నారు నిపుణులు. అలాగే సోలబుల్ ఫైబర్ కలిగి ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచడానికి ఇందులోని పోషకాలు సహాయపడతాయి. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు కూడా యాపిల్ పండ్లను తినవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

*నారింజ : నారింజ పండ్లలో చక్కెరస్థాయిలు తక్కువగా ఉంటాయి. పైగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి నారింజ పండ్లను ఒక పరిమితికి లోబడి డయాబెటిస పేషెంట్లు తినవచ్చు. అతిగా తినడం మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు.

*దానిమ్మ : గ్లూకోజ్ లెవల్స్ అధికంగా ఉండే వారు దానిమ్మను తినడం మంచిది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్, చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొత్తం ఆరోగ్యానికి దానిమ్మ మేలు చేస్తుంది.

*బొప్పాయి : బొప్పాయిలో కూడా షుగర్ కంటెంట్, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్లు, ఫైబర్, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవడంవల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే పోషకాహార నిపుణులను సంప్రదించగలరు.


Read More ...

మనం తినే కూరగాయలు విదేశాలవా? ఆశ్చర్యపోకండి.. ఆధారాలు ఇవే!







Advertisement

Next Story

Most Viewed