జులై ఒకటి నుంచి ఆ రాశుల వారికి డబ్బే.. డబ్బు

by Shiva |   ( Updated:2023-06-26 16:59:40.0  )
జులై ఒకటి నుంచి ఆ రాశుల వారికి డబ్బే.. డబ్బు
X

దిశ, వెబ్ డెస్క్ : జులై ఒకటి నుంచి కొన్ని రాశుల వారిని ధనలక్ష్మి కటాక్షించనుంది. కుజుడు తన రాశిని మార్చుకుని వచ్చే నెల ఒకటి నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. దీంతో మొత్తం 12 రాశుల వారికి కొన్ని వ్యతిరేక, అనుకూల ఫలితాలు ఇవ్వనున్నాడు. ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండొచ్చు. కుజ ప్రభావంతో ద్వాదశ రాశుల్లో ఈ మూడు రాశులకు మంచి ఫలితాలు రానున్నాయి.

మేష రాశి..

ఈ రాశి వారికి మంచి లాభాలున్నాయి. ఐదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం రెండింతలవుతుంది. కుజుడు 8వ ఇంటికి అధిపతి కావడంతో వ్యాపారంలో లాభాలుంటాయి. సంతానం లేని వారికి సంతానభాగ్యం కలుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు పెరుగుతాయి.

తుల రాశి..

తుల రాశి వారికి కూడా బాగా కలిసొస్తుంది. ఆదాయంలో కుజుడు ఉండటం వల్ల ఆదాయం బాగా వస్తుంది. కెరీర్ లో మంచి స్థానం అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు ఒక్కసారిగా పెరుగుతాయి. మనసులో అనుకున్న పనులు త్వరితగతిన పూర్తవుతాయి. డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం కానుంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి వారికి లాభాలున్నాయి. తొమ్మిదో ఇంట సంచారం వల్ల ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి మద్దతు కలుగుతుంది. కోరికలు నెరవేరేందుకు ఆస్కారం ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఈ నేపథ్యంలో చేపట్టే పనులు సాఫీగా ముందుకు సాగుతాయి. ఇలా కుజ ప్రభావంతో మంచి ప్రయోజనాలు దక్కుతాయి.

Read More..

మీ కలలో దేవుళ్లు కనిపిస్తే భవిష్యత్ లో జరుగబోయేది ఇదేనట..

Advertisement

Next Story

Most Viewed