- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Longevity : మీ ఆయుష్షు పెరగాలా..? అయితే ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వాల్సిందే!
దిశ, ఫీచర్స్ : మీరు సాధారణంకంటే ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా..? అయితే ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వాల్సిందే. ఎందుకంటే స్నేహ బంధాలు అనారోగ్యాల రిస్క్‌ను తగ్గిస్తాయని, తరచుగా కలిసి చిల్ అవ్వడంవల్ల ఆయుష్షును పెరుగుతుందని ‘ఎపిడెమియలాజీ అండ్ సైకియాట్రిక్ సైన్సెస్’ జర్నల్‌లో పబ్లిషైన అధ్యయనం పేర్కొంటున్నది. 2019లో బ్రిఘం యంగ్ యూనివర్సిటీ(Brigham Young University) పరిశోధకుల అధ్యయనంలోనూ ఇది వెల్లడైంది. అయితే ఫ్రెండ్షిప్ జీవన ప్రమాణాన్ని పెంచడంలో ఎలా సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం.
సామాజిక పరస్పర చర్యలు
స్నేహితులను కలిగి ఉండటం, తరచుగా వారితో కలిసి చిల్ అవడం వ్యక్తుల జీవన ప్రమాణంపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి పరిశోధకులు 3, 849 మందిని రెండు కేటగిరీలుగా విభజించి, సుదీర్ఘకాలంపాటు అబ్జర్వ్ చేశారు. వారి అనారోగ్యాలు, మరణం వంటి అంశాలను కూడా విశ్లేషించారు. కాగా వీరిలో తరచుగా స్నేహితులతో కలిసి మాట్లాడటం, మాట్లాడటం, సామాజిక పరస్పర చర్యల్లో పాల్గొనడం వంటి సంబంధాలు కలిగి ఉన్నవారు ఎక్కువ కాలం సంతోషంగా, ఆరోగ్యంగా జీవించారని పరిశోధకులు గుర్తించారు. అలాగే స్నేహితులతో తక్కువ సంబంధాలు కలిగి ఉన్నవారు ఎక్కువగా ఒంటరితనంతో బాధపడటమే కాకుండా, తక్కువ కాలం జీవించారని కూడా గుర్తించారు. అయితే మంచి స్నేహాల వల్ల మాత్రమే ఇక్కడ మేలు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా రీసెర్చర్స్ ఎనలైజ్ చేశారు. టాక్సిక్ ఫ్రెండ్ షిప్‌ను పక్కన పెడితే మన మేలు కోరే స్నేహ బంధాలు ఆయుష్షు పెరగడంలో సహాయపడతాయని కనుగొన్నారు.
సమస్యల పరిష్కారంలో కీ రోల్
ఒడిదుడుకులు ఎదురైనప్పుడు సహాయంగా నిలవడం, కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోలేని విషయాలను, సమస్యలను పరిష్కరించడంలో స్నేహితులు ముందుంటున్నారని రీసెర్చర్స్ పేర్కొన్నారు. అలాగే అనారోగ్యాలు సంభవించినప్పుడు, ప్రియమైన వారు దూరమైనప్పుడు భావోద్వేగ మద్దతును అదించడంలో, కష్టాల నుంచి బయడపడేందుకు సహాయం చేయడంలో క్లోజ్ ఫ్రెండ్స్ సహాయపడుతున్నట్లు గుర్తించారు. స్త్రీలైనా, పురుషులైనా చక్కటి స్నేహబంధాన్ని కలిగి ఉన్నప్పుడు అది వారి ఆనందానికి, ఆయుష్షు పెరగడానికి అదే దోహదపడుతుందని గమనించారు. సో.. మీరూ ఎక్కువకాలం జీవించాలనుకుంటే.. చిన్ననాటి స్నేహితులతో కనెక్ట్ అవ్వడం, కలిసి చిల్ అవ్వడం చక్కటి మార్గం అంటున్నారు నిపుణులు.
మిడిల్ ఏజ్ తర్వాత కూడా..
యంగ్ ఏజ్‌లోనే కంటే కూడా మిడిల్ ఏజ్‌లో, ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత, మహిళల్లో అయితే మెనోపాజ్ దశ తర్వాత చిన్ననాటి స్నేహబంధాలు భావోద్వేగ మద్దతును అందిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది వ్యక్తుల్లో ఆనందానికి, జీవన కాలం పెరగడానికి కారణం అవుతున్నట్లు కనుగొన్నారు. అలాగే పరస్పరం కలిసి మాట్లాడుకోవడం, బాధలు, సంతోషాలు షేర్ చేసుకోవడం, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం వంటివి ఒత్తిడి, ఆందోళన, నిరాశా భావాలను దూరం చేయడం, స్నేహితుల సపోర్ట్‌తో సవాళ్లను ఎదుర్కోవడం జీవితకాలాన్ని పెంచడంలో సహాయపడుతున్నట్లు రీసెర్చర్స్ పేర్కొంటున్నారు.