Food for blood Group : బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారం.. ఎవరు ఏది తింటే ఆరోగ్యంగా ఉంటారు?

by Javid Pasha |
Food for blood Group : బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారం.. ఎవరు ఏది తింటే ఆరోగ్యంగా ఉంటారు?
X

దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో పలువురు అనారోగ్యాలు, రక్తహీనత వంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఉరుకుల, పరుగుల జీవితం, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటివి కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. సరైన పోషకాహారం తీసుకోపోయినా లేదా తీసుకునే ఆహారం పడకపోయినా ఇలా జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. సహజంగానే తగిన పోషకాలు కలిగిన ఆహారాలు ఎవరైనా తినాల్సిందే. అలాగే బ్లడ్ గ్రూప్‌లను బట్టి కూడా తినాల్సినవి, తినకూడనివి ప్రత్యేకంగా ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు సరిపడని ఫుడ్స్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దాంతో తలనొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారాలు ఎంచుకోవడం మంచిదని, సరిపడని ఆహారాలు తక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో చూద్దాం.

బ్లడ్ గ్రూప్ A : ఈ రక్తనమూనా ఉన్నవారు ద్రాక్షపండ్లు, నేరేడు పండ్లు, గుమ్మడి కాయ, క్యారెట్లు, సోంపు గింజలు, బ్లూ బెర్రీస్, బ్రోకలీ, చెర్రీ పండ్లు, సోయా ఉత్పత్తులు, గుడ్లు వంటివి తీసుకోవాల్సిన ఆహారాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక తినకూడని ఆహారాల విషయానికి వస్తే ‘ఎ’ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు వంకాయలు, బీన్స్, టొమాటోలు ఎక్కువగా తినకూడదంటున్నారు పోషకాహార నిపుణులు.

బ్లడ్ గ్రూప్ B : వీరు కాటేజ్ చీజ్, బీట్‌ రూట్, బాదం, పెరుగు, వంకాయ, ద్రాక్ష పండ్లు, కిడ్నీ బీన్స్, మిరియాలు, ఆవుపాలు, మటన్ తినాల్సిన ఆహారాలుగా ఉన్నాయి. వీటిని ఎప్పుడు తిన్నా ఏమీ కాదు. ఇకపోతే ఈ గ్రూపు వారికి చికెన్, మొక్కజొన్న, పప్పులు, సోయా ఉత్పత్తులు వంటివి ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వీరి శరీరానికి పడకపోవచ్చు అని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.

బ్లడ్ గ్రూప్ A, B : ఈ రక్త నమూనాలు కలిగినవారు రెడ్ వైన్, మటన్, పాలు, వెల్లుల్లి, పీనట్ బటర్, పాలు, పెరుగు, పప్పు, గుడ్లు, అంజీర్, ఆక్రోట్స్, కాలీ ఫ్లవర్, కర్బూజా వంటివి తినడం మంచిది. అలాగే వీరికి మొక్కజొన్నలు, చికెన్, అరటిపండ్లు వంటివి ఎక్కువగా పడవు. కాబట్టి తక్కువగా తినాలి.

బ్లడ్ గ్రూప్ O : వీరు తినాల్సిన ఆహారాల్లో ఉల్లిపాయలు, చికెన్, పాలకూర, ఆలివ్ ఆయిల్, అల్లం, వెన్న, మటన్, అరటిపండ్లు, మామిడి కాయలు, చేపలు, బాదం ప్రముఖంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇక తినకూడని ఆహారాల విషయానికి వస్తే గోధుమ పిండితో చేసిన ఆహారాలు, సోయాబీన్ నూనెతో వండిన పదార్థాలు, కిడ్నీ బీన్స్ వంటి తక్కువగా తినాలి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story