ఉదయాన్నే పొట్ట శుభ్రం అవ్వాలంటే ఈ ఐదు అద్భుతమైన చిట్కాలు పాటించండి

by samatah |   ( Updated:2023-07-18 10:24:52.0  )
ఉదయాన్నే పొట్ట శుభ్రం అవ్వాలంటే ఈ ఐదు అద్భుతమైన చిట్కాలు పాటించండి
X

దిశ, ఫీచర్స్: మారుతున్న కాలంతో పాటు ప్రజల జీవన శైలి కూడా మారిపోయింది. తినే తిండి.. మేల్కొనే, నిద్రించే సమయం పూర్తిగా చేంజ్ అయింది. నైట్ లైఫ్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్పైసీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడాన్ని ఇష్టపడుతున్నారు. దీని వల్ల అజీర్ణం, కడుపులో మంటతో ఉదయం పొట్ట శుభ్రం కాక చాలా మంది మలబద్ధకం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యకు ఉపశమనాన్ని అందించే వంటింటి చిట్కాలు మీ కోసం.

1. జీలకర్ర నీరు:

జీలకర్రతో జీర్ణశక్తి పెరుగుతుంది. రోజూ ఉదయం జీలకర్ర వేసి మరిగిన నీరు తాగితే పొట్టకు చాలా మేలు చేస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులో ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. వాము నీరు:

నిపుణుల సూచనల మేరకు అజ్వైన్ నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాము నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపులో ఉబ్బరం ఉండదు. ఉదయం పూట పొట్ట క్లియర్ చేయడంలో బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ పానీయం మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. పీరియడ్ పెయిన్‌తో ఇబ్బంది పడుతున్న వారు విముక్తి పొందడానికి ఈ నీటిని తాగొచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్‌ సమస్యలతో బాధపడుతున్న వారికి, గొంతు సమస్యతో సతమతమవుతున్న వారికి ఈ అజ్వైన్ నీరు తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.

3. తేనె, నిమ్మరసం:

ప్రతి రోజూ ఉదయాన్నే నిమ్మరసంలో తేనె కలిపి తాగడం వల్ల మలబద్ధకం, జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం, అజీర్తి వంటి పొట్టకు సంబంధించిన సమస్యలు నయమవుతాయి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల పొట్ట కూడా బాగా శుభ్రపడుతుంది. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.

4. కలబంద రసం:

కలబంద రసం అంటే చేదుగా ఉంటుంది అని ఇష్టపడరు. దీంతో దీన్ని తీసుకునేందుకు వెనుకడుగేస్తుంటారు. కానీ ఈ మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో కలబంద రసం చాలా మేలు చేస్తుంది. తరచుగా అలోవెరా జ్యూస్‌ని తక్కువ మొత్తంలో తాగడం ప్రారంభించండి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి6 , విటమిన్ బి12 ఉంటాయి. సోడియం, ఐరన్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, జింక్, క్రోమియం, సెలీనియం, కాల్షియం వంటి ఖనిజాలు కలబందలో పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది అనేక కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది.

5. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి:

జీర్ణక్రియకు ఉత్తమమైన ఆహారం చాలా ముఖ్యం. అందుకే ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్యారెట్, ఓట్స్, కాయధాన్యాలు, బీన్స్, యాపిల్, స్ట్రాబెర్రీలు, వంటి అధిక ఫైబర్ ఫుడ్స్ ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది.

ఇవి కూడా చదవండి: స్పైసీ ఫుడ్ తిన్నాక కడుపు మంట తగ్గాలంటే.. ఈ టిప్స్ పాటించండి

Advertisement

Next Story

Most Viewed