ముగ్గురికి పుట్టిన తొలి బిడ్డ.. కాంట్రవర్షియల్ ట్రీట్మెంట్ సక్సెస్

by Anjali |   ( Updated:2023-05-11 14:08:26.0  )
ముగ్గురికి పుట్టిన తొలి బిడ్డ.. కాంట్రవర్షియల్ ట్రీట్మెంట్ సక్సెస్
X

దిశ, ఫీచర్స్: యూకేలో ముగ్గురు వ్యక్తులకు బిడ్డ పుట్టింది. మార్గదర్శక ఐవీఎఫ్ విధానం మైటోకాండ్రియల్ డొనేషన్ ట్రీట్మెంట్(MDT) ద్వారా ముగ్గురి డీఎన్ఏ నుంచి శిశువు అభివృద్ధి చేయబడింది. ఈ పద్ధతిలో తల్లి గుడ్డు నుంచి న్యూక్లియస్ తీసుకోబడుతుంది. ఇందులోని డీఎన్‌ఏ దాత గుడ్డులో అమర్చబడుతుంది. డొనార్ ఎగ్ కేంద్రకాలు తొలగించబడతాయి కానీ దాని ఆరోగ్యకరమైన మైటోకాండ్రియల్ DNA అలాగే ఉంచబడుతుంది. ఫలితంగా పుట్టే శిశువు తన DNAలో ఎక్కువ భాగం(99.8 శాతం)తల్లి, తండ్రి నుంచి కలిగి ఉంటే.. దాత నుంచి చాలా తక్కువ మొత్తంలో జన్యు పదార్థం(మొత్తం 37 జన్యువులు ఉన్నట్లు అంచనా) ఉంది.

తల్లుల నుంచి వచ్చే హానికరమైన ఉత్పరివర్తనలు లేకుండా IVF పిండాలను సృష్టించడమే ఈ పద్ధతి ప్రధానోద్దేశం. కాగా నవజాత శిశువు లోపభూయిష్ట జన్యువులను వారసత్వంగా పొందకుండా నిరోధించింది. అంటే వైద్యులు జీవసంబంధమైన తల్లి మైటోకాండ్రియాలో అసాధారణతలను గుర్తిస్తే.. MDT ఒక పరిష్కారంగా ఉంటుంది.

మైటోకాండ్రియా శిశువుల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

మానవులలో 20,000 జన్యువులు ఉన్నాయి. ఇవి పిండ దశలో ప్రధానంగా కేంద్రకంలో కేంద్రీకృతమై ఉంటాయి. ఫలదీకరణం చేయబడిన గుడ్డులోని ప్రతి కేంద్రకం చుట్టూ వేలాది మైటోకాండ్రియాలు వాటి సొంత జన్యువులను కలిగి ఉంటాయి. సరైన ఆరోగ్యకరమైన పిండంలో మైటోకాండ్రియా ప్రధాన పాత్ర కణాలకు శక్తిని అందించి.. అవయవాలను ఏర్పరచడం.

కాబట్టి ఇవి దెబ్బతిన్నట్లయితే లేదా ఉత్పరివర్తనలు కలిగి ఉంటే.. శిశువు పెరిగేకొద్దీ మెదడు, గుండె, కాలేయం, ఇతర ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపుతుంది. అధ్యయనాల ప్రకారం మైటోకాండ్రియల్ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా 4,300 జననాలలో ఒకరిని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లోనే మైటోకాండ్రియల్ డొనేషన్ ట్రీట్మెంట్ అనేది శిశువుకు జన్యుపరమైన వ్యాధులు సంక్రమించకుండా కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి:

కలలు ఎందుకు రిపీట్ అవుతాయి?

Advertisement

Next Story