- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో భరించలేకపోతున్నామంటూ.. కొలీగ్స్‌ను, బాస్‌లను అమ్మేస్తున్న తోటి ఉద్యోగులు!
దిశ, ఫీచర్స్ : వివిధ వస్తువులు, దుస్తులు, ఆహార పదార్థాలు వంటివి మార్కెట్లో అమ్ముతారని మనకు తెలిసిందే. కానీ వర్క్ ప్లేస్‌లలో తమకు నచ్చని బాస్‌లను, కొలీగ్స్‌ను తోటి ఉద్యోగులే అమ్ముతారంటే మీరు నమ్ముతారా?.. కానీ చైనాలో ఇప్పుడిది నయా ట్రెండ్. ఆయా సంస్థల్లో పనిచేసే ఎంప్లాయీస్, ఆఫీసుల్లో తమకు ఇబ్బందిగా మారిన సహోద్యోగులను, పైఅధికారులను ఈ కామర్స్ సైట్లలో, ఆన్ లైన్‌షాపింగ్‌లలో పెట్టి మరీ సేల్ చేస్తున్నారు. ఇంతకీ ఎందుకలా చేస్తున్నారు? దీని వెనుకగల కారణాలేమిటో చూద్దాం.
సాధారణంగా ఏ ఉద్యోగంలోనైనా సదరు వ్యక్తి కలిగి ఉన్న పోస్టు, హోదా, దానిస్థాయిని బట్టి ఉండాల్సిన వర్క్ తప్పక ఉంటుంది. అట్లనే కొన్నిసార్లు టీమ్ మెంబర్స్ సహకరించకపోవడంవల్లో, తోటి ఉద్యోగులతో తగాదాలవల్లో, బాస్ అధిక పెత్తనంవల్లో స్ట్రెస్ ఎదుర్కోవాల్సి రావచ్చు. మరికొన్నిసార్లు ఏదో మనసులో పెట్టుకొని ప్రతీ చిన్న సమస్యను భూతద్దంలో చూస్తూ ప్రాబ్లమ్ క్రియేట్ చేసే కొలీగ్స్, పైఅధికారుల వల్ల కూడా మెంటల్ టార్చర్స్ ఏర్పడుతుంటాయని నిపుణులు చెప్తున్నారు.
అయితే ఆఫీసుల్లో అనుభవించే మెంటల్ స్ట్రెస్‌ను ఎదుర్కోవడానికి చైనాలోని కొందరు యంగ్ ప్రొఫెషనల్స్ కలిసి ఓ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఏంటంటే.. ఎవరివల్లనైతే ఉద్యోగులు, కార్మికులు తాము ఒత్తిడిని ఎదుర్కొంటారో వారిని సెకండ్ హ్యాండ్ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్‌లలో నమోదు చేసి, అమ్మకానికి పెడుతున్నారు. ప్రజెంట్ క్జియాన్‌యు ప్లాట్‌ఫామ్ ఈ కొత్త ట్రెండ్‌కు వేదికగా నిలిచింది.
ఇకపోతే ఏ రకమైన ఉద్యోగంలో, ఏ స్థాయి ఉద్యోగివల్ల ఎటువంటి ఒత్తిడి ఉంటుందో పేర్కొంటూ బాధితులు వారికి రూ. 4 లక్షల నుంచి రూ. 9 లక్షలకు ఫిక్స్ చేసి ఆన్‌లైన్‌లో సేల్ చేస్తున్నారు. నచ్చిన వారు కొనుక్కొని తమకు స్ట్రెస్ రిలీఫ్ కల్పించాలని వేడుకుంటున్నారు. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా, నెటిజన్లు క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. ఇదంతా నిజమైన అమ్మకం కాదని అక్కడి నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగాల్లో ఎదురయ్యే ఒత్తిడిని ఎదుర్కోవడానికి చైనీస్ యంగ్ ప్రొఫెషనల్స్ జస్ట్ ఫన్నీగా ఈ ట్రెండ్ ఫాలో అయిపోతున్నారట.