- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్క్ డిప్రెషన్‌తో ఒంటరి అవుతున్నారా? బయటపడండిలా
దిశ, ఫీచర్స్ : ఉద్యోగస్తులందరూ ఏదో ఒక సమయంలో విచారం, నిస్పృహను అనుభవించక తప్పదు. ఒక్కోసారి అది దుఖ:భరితంగా కూడా ఉండవచ్చు. నిజానికి ఇలాంటి సమస్యలను ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. దాదాపు ప్రతి రోజు విచారం, ఆందోళనను ఫేస్ చేస్తూ ఎటువంటి మోటివేషన్ పొందలేక 'వర్క్ డిప్రెషన్'తో బాధపడుతూ ఉండవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం.. నెగెటివ్ వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీని వల్ల ఆఫీసులో గైర్హాజరు పెరిగి ఉద్యోగుల ఉత్పాదకత తక్కువ అవుతుంది.
వర్క్ డిప్రెషన్ : ఒక ఉద్యోగి కార్యాలయంలో పనిచేసేటప్పుడు డిప్రెషన్ లక్షణాలను అనుభవించే పరిస్థితినే 'వర్క్ డిప్రెషన్'గా పరిగణిస్తాం. ఈ లక్షణాలు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో కూడా సంభవించవచ్చు. అయితే ఈ సమస్య ఖచ్చితంగా పని వల్లనే కాదు. ఇప్పటికే డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు కూడా పనిచేస్తున్నప్పుడు ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనా వర్క్ యాంగ్జయిటీ రోగిలో నిరాశను తీవ్రతరం చేస్తుంది.
వర్క్ డిప్రెషన్ లక్షణాలు :
* ఆఫీస్‌లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినపుడు ఆందోళన స్థాయిలు పెరుగుతాయి
* ఉద్యోగం పట్ల విసుగు పెరుగుతుంది
* పని పట్ల నిరాసక్తత, ప్రేరణ లేకపోవడం
* పనిలో విచారం ఎదుర్కోవడం
* ఎక్కువ తప్పులు చేయడం, మతిమరుపు
* ఆఫీస్‌లో నిస్సహాయంగా, ఒంటరిగా, అనర్హులుగా భావించడం
* వివరించలేని ఆకలి పెరుగుదల లేదా తగ్గుదల
* అలసట, తలనొప్పి, కడుపు నొప్పి
* చిరాకు, కోపం
* పని వేళలో ఎక్కువగా నిద్రపోవడం
* పనిని భారంగా భావించడం
* సహోద్యోగులకు దూరం
పని ఒత్తిడికి కారణాలు :
* నెగెటివ్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్
* క్రమరహిత వర్కింగ్ షిఫ్ట్స్
* ఆఫీస్ పాలిటిక్స్
* మేనేజర్ లేదా బాస్ నుంచి సహకారం లేకపోవడం
* అధిక పని భారం
* కార్యాలయంలో వేధింపుల అనుభవం
* పని ప్రదేశంలో అసురక్షిత భావన
* వర్క్-లైఫ్ బ్యాలన్స్ చేసుకోలేకపోవడం
* ఉద్యోగం పోతుందనే భయం/ప్రమాదం
* ఆఫీస్ సవాళ్లను హ్యాండిల్ చేయలేకపోవడం
* నైతిక విలువలకు విరుద్ధంగా ఏదైనా చేయడం
* కెరీర్ లక్ష్యానికి సరిపోని విధంగా పని చేయడం
పని ఒత్తిడిని ఎలా నివారించాలి?
* ప్రతి అరగంటకు డెస్క్ నుంచి 10 నిమిషాల విరామం తీసుకోవాలి.
* ఓపెన్ ప్లేస్‌లో లంచ్ చేసేందుకు ప్రాధాన్యతనివ్వాలి.
* విరామాల్లో తేలికపాటి శారీరక వ్యాయామం మానసిక ఆరోగ్యానికి ఊతమిస్తుంది.
* ఇంట్లో, ఆఫీసులో కాసేపు ధ్యానం చేయాలి.
* శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయాలి.
* కొలీగ్స్‌తో మాట్లాడేందుకు లేదా నచ్చిన ఫన్నీ వీడియో చూసేందుకు ఆఫీసులో బ్రేక్ తీసుకోవాలి.
* ఈ సమస్య గురించి బాస్, హెచ్‌ఆర్‌తో బహిరంగంగా మాట్లాడాలి.
* మరిన్ని సమస్యల విషయంలో వైద్యుని సాయం తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి
1.మంచి కథకుడు మనసు దోచేస్తాడా?..శృంగార భాగస్వాములను ఆకర్షించడంలో కీ రోల్
- Tags
- Health tips