- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Most popular : 2024లో వీళ్లు చాలా ఫేమస్.. గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసింది వీరి గురించే..
దిశ, ఫీచర్స్ : గూగుల్ అంటేనే సమాచార సర్వస్వం.. వరల్డ్ మోస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ కూడా అదే. మనకు ఏ డౌట్ వచ్చినా వెంటనే సెర్చ్ ఇంజిన్‌లో టైప్ చేస్తే చాలు. కావాల్సిన సమాచారం క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. అయితే ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా గూగుల్లో ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసిన ఫేమస్ పర్సన్ ఎవరనే విషయాన్ని ఈ టెక్ దిగ్గజం వెల్లడించింది. ఇందులో ఫస్ట్ రెండు స్థానాల్లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump), కేట్ మిడిల్టన్(Kate Middleton) ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ అయిన మిడిల్టన్ మొదటి, రెండవ స్థానాల్లో ఫేమస్ పర్సన్స్‌గాప్రజాదరణ పొందడం వెనుక చాలా కారణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు. ఈ ఏడాది వీరి జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన పరిణామాలు అందుకు దోహదం చేశాయి. అందరికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచేందుకు, మరింత ప్రజాదరణ పొందేందుకు కారణం అయ్యాయి. అవేమిటంటే.. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హత్యాయత్నం నుంచి తప్పించుకోగా, కేట్ ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించారు. ఈ రెండు అంశాలు ప్రజల్లో వారిపట్ల సానుభూతికి, ఎక్కువ ఆదరణకు కారణం అయ్యాయి.
2024 జులై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరపగా, బుల్లెట్ ఆయన కుడి చెవిని తాకుతూ దూసుకుపోయింది. ఆ సమయంలో రక్తం కారుతున్నా ట్రంప్ భయపడలేదు. పిడికిలి పైకెత్తి తన ధైర్యాన్ని ప్రదర్శించడం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఆ తర్వాత ఆయన విజయం సాధించారు. కాగా చాలా మంది ఆన్‌లైన్‌లో ‘ట్రంప్ అస్సాస్సినేషన్ అట్టెంప్ట్’ అని సెర్చ్ చేశారు. దీంతో ఇది మోస్ట్ సెర్చ్‌డ్ వర్డ్‌గా, ట్రంప్ మోస్ట్ ఫేమస్ పర్సన్‌గా నిలిచారు.
వేల్స్ ప్రిన్సెస్ మిడిల్టన్ విషయానికి వస్తే.. 2024లో మార్చిలో తాను క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు అనౌన్స్ చేశారు. దీనిని ఎదుర్కోవడానికి కీమో థెరపీ చేయించుకుంటానని వెల్లడించారు. ఈ విషయం ప్రపంచానికి తెలియజేయడానికి ముందు ఆమె పబ్లిక్ లైఫ్‌కు దూరంగా ఉండటంతో సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. కొందరు ఆమె హెల్త్ గురించి చర్చించగా, మరికొందరు ప్రిన్స్ విలియంతో డివోర్స్ తీసుకున్నారేమోనని రకరకాల సందేహాలు వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె మోస్ట్ ఫేమస్ పర్సన్‌గా, గూగుల్లో అత్యధికమంది సెర్చ్ చేసిన వ్యక్తిగా రెండవస్థానంలో నిలిచారు. ఇక ఆ తర్వాత స్థానాల్లో కమలా హారిస్, బాక్సర్ ఇమానే ఖలీఫ్, ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమంది గూగుల్ సెర్చ్ చేసిన ఐదుగురు వ్యక్తుల జాబితాలో నిలిచారు.
Read More..