ఎండకు తట్టుకోలేక స్విమ్మింగ్ చేస్తున్నారా?.. అంతకు ముందు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలంటున్న నిపుణులు

by Javid Pasha |   ( Updated:2024-04-25 14:03:22.0  )
ఎండకు తట్టుకోలేక స్విమ్మింగ్ చేస్తున్నారా?.. అంతకు ముందు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : సమ్మర్ వచ్చిందంటే అందరూ చల్లదనం గురించే ఆలోచిస్తారు. బయట తిరిగేవారు ఎండవేడి, ఉక్కబోతల కారణంగా చల్లటి ప్రదేశాల్లో సేద తీరాలనుకుంటారు. అలాగే చల్లని పానీయాలు తాగాలనుకుంటారు. దీంతోపాటు పలువురు సరదాగా స్విమ్మింగ్ చేయాలని కూడా అనుకుంటారు. ఒకప్పుడైతే వేసవి సెలవుల్లో పిల్లలు గ్రామాలకు వెళ్లి బావుల్లో, చెరువుల్లో ఈత నేర్చుకునేవారు. ప్రస్తుతం బావులు చాలా వరకు కనుమరుగై పోయాయి. చెరువులు ఎండిపోతున్నాయి. దీంతో చాలామంది ప్రత్యామ్నాయంగా స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లడం ప్రారంభించారు. అయితే స్విమ్మింగ్ చేసేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు.

*అలెర్జీలు రాకుండా మాయిశ్చరైజ్ : స్విమ్మింగ్ పూల్‌ నిర్వాహకులు అందులోని నీరు శుభ్రంగా ఉండాలని కొన్నిసార్లు బ్లీచింగ్ పౌడర్స్ వంటివి కలిపే అవకాశం ఉంటుంది. నీటిలో దీనిశాతం ఎక్కువైతే స్విమ్ చేసేవారి స్కిన్ అలెర్జీలు తలెత్తవచ్చు. అందుకే స్విమ్ చేసేముందు నీటిలో ఏమైనా కలిపారో లేదో ఆరాతీయడం, గమనించడం మంచిది. అలాగే ఈత కొట్టడంవల్ల శరీరంలో తేమను కోల్పోతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే పూల్‌లోకి దిగడానికి ముందు బాడీకి మాయిశ్చరైజర్ కానీ, కొబ్బరి లేదా ఆలీవ్ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలని చర్మ వ్యాధి నిపుణులు సూచిస్తు్న్నారు.

*ఎండ నుంచి రక్షణకు లోషన్ : స్విమ్మింగ్ పూల్ దగ్గరలో ఉండకపోవచ్చు. స్విమ్ చేయడానికి ఎక్కడో దూరంలో ఉన్న బావికో, పూల్‌కో ఎండలో వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీపై ఎండ ప్రభావం పడకుండా, స్కిన్ అలెర్జీలు రాకుండా ఉండాలంటే సన్ స్ర్కీన్ క్రీములను అప్లై చేయాలి. ఇవి సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల నుంచి బాడీని రక్షిస్తాయి. అయితే సన్ స్క్రీన్ లేదా లోషన్ అప్లై చేసిన 15 నుంచి 20 నిమిషాల తర్వాత మాత్రమే స్విమ్మింగ్ చేయడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.

Read More..

రాత్రి సమయంలో స్నానం చేస్తే ఇన్ని లాభాలా?

Advertisement

Next Story