- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నియామకాల్లో మహిళలకు ప్రయారిటీ.. కొన్ని కంపెనీల్లోనే ఎందుకు?
దిశ, ఫీచర్స్: అన్ని రంగాల్లోనూ స్త్రీ, పురుష సమానత్వం కలిగి ఉండాలనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. కానీ ఆచరణకు వచ్చేసరికి మహిళలపట్ల ఎక్కడో ఒకచోట నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంటోందని ఉమెన్ హ్యూమన్ రిసోర్స్ నిపుణులు పేర్కొంటున్నారు. పలు కంపెనీల నియామకాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోందని చెప్తున్నారు. అయితే తాజా పరిశీలన ప్రకారం..
ఆపిల్(Apple) వంటి కొన్ని పెద్ద సంస్థల్లో మహిళలను రిక్రూట్ చేసుకోవడం సంతోషించ దగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇండియన్స్‌కు, ముఖ్యంగా మహిళలకు అనుకూలమైన రీతిలో ఆఫిల్ సంస్థ జాబ్స్ క్రియేట్ చేస్తోంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సంస్థ నియమించిన ఫ్రెషర్స్‌లో దాదాపు 72% మంది మహిళలు ఉన్నారు. వీరంతా తగిన నైపుణ్యాన్ని కూడా కలిగి ఉన్నారు.
2025 నాటికి భారతదేశంలో 25% ఐఫోన్‌లను తయారు చేయడానికి సదరు కంపెనీ, దాని విస్తరణ, కార్యకలాపాల బాధ్యతను మహిళలకు అప్పగించడం నిజంగా మహిళలకు సాధికారత కల్పించడమే అంటున్నారు స్త్రీ వాదులు. వర్క్ ఫోర్స్‌లో ఈక్వాలిటీని సాధించడానికి ఇటువంటి నిర్ణయాలు అన్ని రంగాల్లో తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు.
శ్రామిక శక్తిలో సగం
భారతదేశంలోని ఆపిల్ కంపెనీ అనేక విభాగాల్లో మహిళలను నియమించింది. కొత్తగా 72 శాతం మహిళా ఉద్యోగులను నియమించుకోగా దాదాపు 30 వేలమంది స్త్రీలను ఆపిల్ సప్లయర్ విభాగం ఫాక్సాన్ నియమించుకుంది. ఇక దాని అనుబంధ ‘జబిల్‘ సంస్థ మొత్తం 7000 మంది వర్క్ ఫోర్స్ లలో 4200 మంది మహిళా కార్మికులను కలిగి ఉంది. అంటే సగానికిపైగా ఉమెన్స్‌కే ప్రయారిటీ ఇచ్చింది. అయితే మహిళా శ్రామికశక్తిలో ఎక్కువ మంది 19 నుంచి 24 సంవత్సరాల వయస్సు గలవారే ఉండటం అనేది ఇదే మొదటిసారి. కంపెనీ తన భవిష్యత్తుకోసం యంగ్ టాలెంటెడ్ ఉమెన్స్‌కు ప్రాముఖ్యతను ఇస్తోందని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఈక్వాలిటీకి ప్రోత్సాహం
కొన్ని కంపెనీలు జండర్ ఈక్వాలిటీని ప్రోత్సహించడం, వర్క్ ఫోర్సులలో మహిళలకు నాయకత్వం వహించే అవకాశాన్ని కల్పించడం మంచి పరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి అవకాశం లేకపోతే మహిళల సామర్థ్యం ఏమిటో మనకు ఎప్పటికీ తెలియదని పేర్కొంటున్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మహిళల నేతృత్వంలోని అనేక కంపెనీలు గొప్పగా పని చేస్తున్నాయి. వాటి పరిధిని విస్తరించాయి.
అయితే కొన్నిచోట్ల స్త్రీలు సమాన పనికి సమాన వేతనం ఇప్పటికీ పొందడం లేదు. ఒకే రకమైన పనిలో పురుషుల కంటే తక్కువ వేతనం పొందడం అనే పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది’’ అంటున్నారు మెహతా రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ హెచ్.ఆర్ మౌనిక చద్దా. చాలా కంపెనీలు లేదా సంస్థలు మహిళలకు తరచుగా ఉండే ఇంటి బాధ్యతలను, ఎమోషనల్ రేషనాలిటీని వారి కెరీర్‌కు అడ్డంకిగా భావిస్తుంటాయని, కానీ ఇది హేతుబద్ధతకు వ్యతిరేకమైందని ఆమె పేర్కొన్నారు. నిజానికి మహిళలు పురుషులకంటే గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించగలరని తెలిపారు.
కొన్నింటికే పరిమితం కావొద్దు
కార్పొరేట్ రంగంలోని పలు సంస్థల్లో మహిళల లీడింగ్ రోల్‌ను మనం చూస్తున్నప్పటికీ కొన్ని ప్రముఖ కంపెనీలకే అది పరిమితమవుతోంది. ఇక మధ్య తరహా, చిన్న పరిశ్రమల్లో లేదా కంపెనీల్లో ఇప్పటికీ మహిళలను అనర్హులుగానే చూస్తున్నారు. మీడియా కూడా ఈ విషయాన్ని ఎక్కువగా ఫోకస్ చేయడం లేదన్న విమర్శలున్నాయి. మహిళా సాధికారత సాధ్యం కావాలంటే, అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించే చర్యలను సమర్థించాలని, వారిని నిర్లక్ష్యం చేసే పరిస్థితిని ఎండగట్టాలని స్త్రీవాదులే కాకుండా హ్యూమన్ రిసోర్స్ నిపుణులు కూడా పేర్కొంటున్నారు.
నైపుణ్యంలోనూ గ్రేట్
‘‘కంపెనీ లేదా సంస్థ చిన్నదైనా.. పెద్దదైనా మహిళా ఉద్యోగులకు సమాన అవకాశం ఇవ్వాల్సిన అవసరాన్ని అందరూ గుర్తించాలి. ఎందుకంటే మహిళలకు పురుషులతో సమానంగానే కాదు, అంతకుమించి నాయకత్వం వహించే సామర్థ్యం, స్కిల్స్ ఉన్నాయని అనేక విషయాల్లో నిరూపించబడుతోంది. అందుకే వారిని కొన్ని రంగాలకే పరిమితం చేయాలనే ఆలోచన మారాల్సిన అవసరం ఉంది.
తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ అత్యంత సమర్థవంతంగా నైపుణ్యం కనబరిచేది కేవలం మహిళలే అని గుర్తించిన కంపెనీలు ఇప్పటికే వారికి ప్రాధాన్యతనిస్తూ ముందంజలో ఉన్నాయి. మిగతా రంగాల్లోని నిపుణులు కూడా మహిళలకు ప్రయారిటీ ఇచ్చే విషయం, జండర్ ఈ క్వాలిటీని పాటించే విషయం ఆలోచించాలి’’ అంటున్నారు.
ముంబైకి చెందిన రిక్రూట్‌మెంట్ నిపుణులు వైదేహి గుప్త. ‘ఒక మగవాడు తన పిల్లలకు తండ్రిగా ఉంటూ ఉన్నతమైన బాధ్యతలు ఎలా నిర్వహించగలడు అని ప్రశ్నించని వారు, ఒక మహిళ పిల్లలకు తల్లిగా ఉంటూ ఉద్యోగ బాధ్యతలను ఎలా నిర్వహించగలదు? అని కొందరు ప్రశ్నిస్తుండటం మనం చూస్తుంటాం. కానీ ఇది పూర్తి అవగాహన రాహిత్యంతో కూడిన ప్రశ్నగా మనం అర్థం చేసుకోవాలి. అవకాశం కల్పిస్తే అన్నింటిలోనూ లీడింగ్ రోల్, కీ రోల్ పోషింగలిగే సత్తా పురుషులతో సమానంగా మహిళలకూ ఉంటుంది’’ అంటున్నారు ప్రముఖ కార్పొరేట్ అండ్ పర్సనల్ స్కిల్స్ ట్రైనర్ సరయూ మెహతా.