- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిన్న వెంటనే ఏర్పడే అసౌకర్యం దేనికి సంకేతం? అలెర్జీనా.. అసహనమా?
దిశ, ఫీచర్స్: మనం ఆరోగ్యంగా జీవించడానికి ఆహారం ఎంతో ముఖ్యం. అయితే కొన్ని సందర్భాల్లో తినగానే కడుపునొప్పి, తలనొప్పి, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఫుడ్ అలెర్జీ లేదా ఫుడ్ ఇంటాలరెన్స్ వంటి రుగ్మతలు ఉన్నవారికి ఇలా జరుగుతుందని ఆహార నిపుణులు అంటున్నారు. చాలామంది అలెర్జీలు ఇంటాలెరెన్స్ లేదా తిన్నవెంటనే కలిగే అసహనం ఒకటే అనుకుంటారు. కానీ ఇవి వేర్వేరు ప్రతిచర్యలని వైద్య నిపుణులు చెప్తున్నారు. వాటి మధ్య తేడాలు తెలిస్తే నివారణ సులభం అవుతుందని పేర్కొంటున్నారు. మోతాదుకు మించి తినడం లేదా తినకపోవడంవల్ల కలిగే ఇబ్బందులను ఫుడ్ ఇంటాలరెన్స్ అంటారు. అలాగే తిన్న ఆహారం పడకపోవడంవల్ల తలెత్తే సమస్యలను అలెర్జీలు అంటారు. ఇవి రెండూ కొన్నిసార్లు ఒకే లక్షణాలను కలిగి ఉంటాయి. కానీ తేడాలు గుర్తించడం చాలా ముఖ్యం.
ఫుడ్ అలెర్జీ - లక్షణాలు
మానవ రోగనిరోధక వ్యవస్థ అనేది బ్యాక్టీరియా, ఫంగస్ లేదా కామన్ కోల్డ్ వైరస్‌ల బారి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఒక వ్యక్తికి ఫుడ్ అలెర్జీ ఏర్పడినప్పుడు ఆ వ్యక్తి ఇమ్యూన్ సిస్టమ్ ఆహారాన్ని రిసీవ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండదు. ప్రతికూలంగా స్పందిస్తుంది. కాబట్టి ఫుడ్ అలెర్జీ అనేది ఒక నిర్దిష్ట ఆహారం తిన్న వెంటనే సంభవించే రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన ప్రతిచర్యగా పేర్కొనవచ్చు. ఈ సమస్య ఎదుర్కొనేవారిలో ఆహారం పడకపోవడంవల్ల వికారం, చర్మంపై దద్దుర్లు, తిమ్మిరితో కూడిన కడుపు నొప్పి, డయేరియా, దురద, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఫుడ్ ఇంటాలెరెన్స్-లక్షణాలు
పాలు, పాల ఉత్పత్తులు ఆహారంగా తీసుకున్నప్పుడు వాటిలో సహజంగా ఉండే చక్కెర లేదా లాక్టోస్ వంటి నిర్దిష్ట భాగాన్ని శరీరం జీర్ణించుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఈ సందర్భంలోనే ఫుడ్ ఇంటాలరెన్స్ ఏర్పడుతుంది. ఇది ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా కాకుండా జీర్ణ వ్యవస్థ ద్వారా ప్రేరేపించబడుతుంది. ఇక లక్షణాల విషయానికి వస్తే కడుపు నొప్పి, గ్యాస్, తిమ్మిరి లేదా ఉబ్బరం, వాంతులు అవడం, గుండెల్లో మంట, అతిసారం, తలనొప్పి, చిరాకు లేదా భయం వంటి ఇబ్బందులు కనిపిస్తాయి. ఫుడ్ అలెర్జీ అండ్ ఫుడ్ ఇంటాలెరెన్స్ అనేవి పూర్తిగా భిన్నమైన రుగ్మతలని గుర్తుంచుకోవాలి.
ఇలా నివారించవచ్చు
ఫుడ్ అలెర్జీలను నివారించడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఒక్కసారి ఎవరికి వారు తమకు పడని ఆహారాలు ఏవో గుర్తించిన తర్వాత వాటికి దూరంగా ఉండటం ఉత్తమమైన మార్గం. ఇక తీవ్రమైన అలెర్జీలు, ఆహారం అసహనం వంటివి ఎదురైతే గనుక వైద్య నిపుణులను సంప్రదించడం బెటర్. అలాగే మీరు బయటకు వెళ్లినప్పుడు అసౌకర్యంగా అనిపించే ఫుడ్, డ్రింక్స్, ఇతర తినుబండారాలను నివారించాలి.
Read more : ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు నేరేడు పండ్లు అస్సలు తీనకూడదు..