Better Thinker.. ఆలోచనా నైపుణ్యాలను పెంచుతున్న బ్రెయిన్ యాక్టివిటీస్

by Javid Pasha |
Better Thinker.. ఆలోచనా నైపుణ్యాలను పెంచుతున్న బ్రెయిన్ యాక్టివిటీస్
X

దిశ, ఫీచర్స్ : మనం నిరంతరం యాక్టివ్‌గా ఉండటంలో, జీవక్రియలను సక్రమంగా నిర్వర్తించడంలో శరీరంలోని ఇతర భాగాలతోపాటు మెదడు కీలక పాత్రపోషిస్తుంది. అయితే బ్రెయిన్‌కు మరో ప్రత్యేకత ఉంది. ఏంటంటే.. ఇది చాలా రహస్యమైన, శక్తివంతమైన అవయవం అంటున్నారు జీవశాస్త్రవేత్తలు. ఒక విధంగా చెప్పాలంటే మావన మెదడు రోజువారీ జీవితంలో ఏం చేస్తుంది?. ఎటువంటి విధులు నిర్వహిస్తుంది? అనే విషయాన్ని మనం పెద్దగా పట్టించుకోం. కానీ మనకు తెలియకుండానే అది చాలా పనులను మనం సమర్థవంతంగా చేసేలా ప్రేరేపిస్తుంది. సందర్భోచితన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. అయితే మన ఆలోచనా నైపుణ్యాలను మరింత మెరుగు పర్చుకోవడానికి మెదడును ఎలా ఉపయోగించుకోవచ్చో కూడా నిపుణులు సూచిస్తున్నారు. ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌ను ఇంప్రూవ్ చేయగల కొన్ని సూత్రాలను వివరిస్తున్నారు.

వేగాన్ని తగ్గించుకోండి

మీ ఆలోచనను ఇంప్రూవ్ చేసుకోవడానికి బహుశా సులభమైన మార్గాల్లో ఒకటి గజిబిజి ఆలోచనల వేగాన్ని తగ్గించుకోవడం. అయితే మీకు కొంచెం ఎక్కువ మేధోశక్తి అవసరమని మీరు భావిస్తే గనుక, ఒక సెకను విరామంతో పాటు లోతైన శ్వాస తీసుకోవడం ద్వారా మళ్లీ మీ పనిని ప్రారంభించాలని, దీంతో మీ బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా భావోద్వేగాల నింయంత్రణలో గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది మానవ మెదడు. వాస్తవానికి కాన్సియస్ థాట్స్ అనేవి మెదడులో జరిగే అనేక చర్యలలో ఒక చిన్న భాగం మాత్రమే. ఏ క్షణంలోనైనా ఒకానొక అపస్మారక స్థితి మీకు కూడా తెలియని చాలా సమాచారాన్ని గ్రహించి మీ మెదడులో భద్ర పర్చుకుంటుంది. దీని ఆధారంగా మీ మెదడు భావోద్వేగాలను ప్రొడ్యూస్ చేస్తుంది. అవసరం అయినప్పుడు నియంత్రిస్తుంది. ఇది సూక్ష్మమైన భావాలను అనుభూతి చెందేలా చేస్తుంది. అందుకే భావాలను, భావోద్వేగాలను అణచివేయకుండా అవసరాన్నిబట్టి అనుభవించాలని నిపుణులు చెప్తున్నారు.

అతి ఆలోచన, ఎక్కువసేపు స్నానం చేయడం

గోరు వెచ్చని నీటితో ఎక్కువసేపు స్నానం చేయడం లేదా ఎక్కువసేపు షవర్ కింద ఉండి స్నానం చేయడం వంటి అలవాట్లు మీ మెదడును చురుకుగా మారుస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి ఇలా కూడా మీ బ్రెయిన్‌ను యాక్టివ్ చేసుకోవచ్చు. అయితే మరీ ఎక్కువసేపు షవర్ కింద ఉండటం మంచిది కాదు. మరో విషయం ఏంటంటే.. మీరు శారీరకంగా, మానసికంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు అతిగా ఆలోచించవద్దు. ఎక్కువగా ఒత్తిడికి లోనైనప్పుడు మీ మనస్సు గజిబిజిగా, అస్పష్టంగా మారుతుంది. అటువంటి పరిస్థితులు ఎదురైతే కొన్ని డీప్ బ్రీత్స్ తీసుకోండి. మీ ప్రవృత్తులను విశ్వసించాలని గుర్తుంచుకోండి. అలాగే మెదడు, మీరు సహజంగానే ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని గ్రహించేలా ఫిల్టర్ చేస్తుంది. అది ఇప్పటికే నమ్ముతున్న దాన్ని నిర్ధారించడానికి మీకు సహాయపడుతుంది. కానీ వీటిలోనూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇక క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంవల్ల మీ మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందుతుంది. ఇది మెరుగైన, జ్ఞానపరమైన చర్యలకు పురిగొల్పుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో, మంచి జడ్జ్‌మెంట్ ఇవ్వడంలో మీరు మెరుగైన స్థితిలో ఉంటారు. అందుకే రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేలా చూసుకోవాలి.

అతి విమర్శలు అస్సలు వద్దు

మీ చుట్టూ క్రిటికల్ పర్సన్ కూడా ఉండే చాన్స్ ఉంటుంది. వారు మీరు చేసే ప్రతి పనిలో ప్రతికూలతను వెతుకుతుంటారు. అయితే ఈ పరిస్థితి క్రమంగా అనవసరమైన అతి విమర్శలు చేసే దిశగా ప్రేరేపిస్తుంది. కాబట్టి మీరు అలాంటి వ్యక్తులను గ్రహించి దూరంగా ఉండటం, మీరు కూడా ఇంప్రూవ్ మెంట్‌కు దోహదపడని విమర్శలు చేయకపోవడం అనేది మీ వర్క్ అండ్ రిలేషన్‌షిప్స్‌లో కీ రోల్ పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. దాంతోపాటు మీ ఆలోచనలకంటే కాస్త మెరుగైన అంశాలను తెలుసుకోవడం, చదవడం మీ మెదడుకు మరింత పదును పెడుతుంది. అందుకే మీకు ఆనందం కలిగించే వాటిపై శ్రద్ధ చూపడం, అవసరమైన పుస్తకాలు చదవడం, టీవీ కార్యక్రమాలు వీక్షించడం మీ ఆలోచనా నైపుణ్యాన్ని పెంచుతుంది. మరో విషయం ఏంటంటే కలలు కనడం.. అంటే మీరు ఏదో సాధించాలని ఊహించుకోవడం, ఉన్న పరిస్థితి నుంచి మెరుగైన పరిస్థితికి సంబంధించిన అనుభూతి చెందడం, పాజిటివ్ ఆలోచనల్లో విహరించడం మీ మెదడులోని న్యూరాన్స్‌ను యాక్టివేడ్ మోడ్‌లోకి నెడుతుంది. కాబట్టి కలలు కనడంవల్ల కూడా వాటిని సాకారం చేసుకునే క్రియేటివిటీని ప్రేరేపించగల గొప్ప సామర్థ్యం ఒక్క మానవ మెదడుకే ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Advertisement

Next Story