Online Shopping : ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా?.. ఇవి గుర్తుంచుకోండి !

by Dishaweb |   ( Updated:2023-08-20 16:34:30.0  )
Online Shopping : ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా?.. ఇవి గుర్తుంచుకోండి !
X

దిశ, ఫీచర్స్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆఫ్‌లైన్ షాపింగ్‌తోపాటు నేడు ఆన్‌లైన్ షాపింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. తమ ఆసక్తులు, అభిరుచులను నెరవేర్చుకునే క్రమంలో చాలామంది కస్టమర్లు ఆమెజాన్, మీ షో, ఫ్లిప్ కార్ట్, షాప్పర్స్ వంటి ఆన్‌లైన్ బేస్డ్ యాప్‌ల మీద ఆధారపడుతున్నారు. వాటి ద్వారా తమకు అవసరమైన క్లాతింగ్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, కంప్యూటర్లు, ఫ్రిజ్‌లు తదితర ప్రొడక్ట్స్‌తో పాటు అనేక రకాల హోమ్ నీడ్స్ వరకు ఒక్క క్లిక్ చచేయడం ద్వారా కొనేస్తున్నారు. చాలామంది ఒక ప్రొడక్ట్‌ను పర్చెస్ చేయాలనుకున్నప్పుడు దాని నాణ్యత గురించి తెలుసుకోవడానికి కామెంట్ సెక్షన్‌లోని యూజర్ల రివ్యూస్‌ను చదివి, స్టార్ రేటింగ్‌ను బట్టి డిసైడ్ అయిపోతుంటారు. ఇక్కడే మోసపోతుంటారు కూడా ఎందుకంటే.. కొన్నిసార్లు పాజిటివ్ రివ్యూస్ ఉన్న వస్తువులు కూడా నాణ్యమైనవిగా ఉండకపోవడం, నెగెటివ్ రివ్యూస్ ఉన్న వస్తువులు కూడా క్వాలిటీగా ఉండటం వంటి అనుభవాలు పలువురికి అరుదుగానైనా ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు మోసపోకుండా ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.

రివ్యూస్ విషయంలో జాగ్రత్త

యూజర్లు పాజిటివ్, నెగెటివ్ రివ్యూలను బట్టి వస్తువులను చూస్ చేసుకోవడం, బుక్ చేసుకోవడం చేస్తుంటారు. సింగిల్ స్టార్ రివ్యూలు కలిగిన వస్తువులను కొనడానికి చాలా వరకు ఇష్టపడరు. అయితే ఇక్కడే మోసాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్‌కు చెందిన మార్కెటింగ్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. కొన్ని సంస్థలు తమ బిజినెస్ ఎనిమీ కంపెనీలను దెబ్బతీయడానికి డబ్బులిచ్చి పాజిటివ్ రివ్యూ రాయించుకోవడం, నాణ్యమైన వస్తువును క్వాలిటీ లేనిదిగా, క్వాలిటీ లేని వస్తువును నాణ్యమైనదిగా కూడా పేర్కొంటూ రివ్యూలు క్రియేట్ చేసే అవకాశం ఉందని నిపుణులు గుర్తించారు. అందుకే తగిన జాగ్రత్తలు అవసరమని చెప్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ తప్పు కాదు, అలాగే రివ్యూలన్నీ తప్పుగా ఉంటాయని చెప్పలేం. కానీ రివ్యూల విషయంలో కొన్నిసార్లు మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి.

ఎలా గుర్తించాలి?

ముఖ్యంగా రివ్యూస్‌లలో ఏవి రియల్? , ఏవి ఫేక్ ? అనేది గుర్తించగలగాలి. కొన్నిసార్లు ఫేక్ పాజిటివ్ రివ్యూలు కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తుంటాయి. మరికొన్ని సార్లు ఫేక్ నెగెటివ్ రివ్యూస్ కూడా సింగిల్ స్టార్స్ ఇస్తుంటాయి. రియల్ రివ్యూస్ కంటెంట్ రాసేవారు సాధారణంగా మంచీ చెడు అన్నీ ప్రస్తావిస్తారు. వాస్తవం ఆధారంగా మధ్యే మార్గంగా స్టార్ రేటింగ్ ఇస్తుంటారు. కాబట్టి ఇవి గమనంలో ఉంచుకుంటే.. తగిన అవగాహన ఏర్పడుతుంది. వస్తువు లేదా సేవకు సంబంధించిన వివరాలు లేకుండా జర్నలైజ్ చేస్తూ మరీ ఎక్కువగా పొగిడేస్తుంటే గనుక అవి కచ్చితంగా పెయిడ్ రివ్యూస్ అయి ఉంటాయని అనుమానించాలి. అలాగే కామెంట్స్‌లో గ్రామర్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్‌ను కూడా పరిశీలించారు. ఐదారు కామెంట్స్ ఒకేలా ఉంటే ఫేక్ రివ్యూగా డౌట్ పడాలి. ఎందుకంటే అవి కాపీ పేస్ట్ కామెంట్లు కావొచ్చు. అలాగే ఒక యూజర్ రివ్యూ లోకల్ ప్రోడక్ట్స్‌కే పరిమితం అయ్యాయా? వరల్డ్ వైడ్ ప్రొడక్ట్స్‌ గురించి కూడా రాసినట్లు సదరు యూజర్ పేర్కొన్నాడా గమనించాలి. ఒక దేశం లేదా లోకడ్ ప్రొడక్ట్ విషయంలో వరల్డ్ వైడ్ పాజివ్ రివ్యూస్ కనిపిస్తున్నాయంటే అవి ఫేక్ అయి ఉంటాయని అనుమానించాలి. మొత్తానికి కాస్త రియలిస్టిక్ థాట్స్, సోషల్ నాలెడ్జ్ కలిగి ఉండటంవల్ల ఆన్‌లైన్ షాపింగ్ మోసాలను పసిగట్టవచ్చునని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story