డిప్రెషన్‌కు మందులే పరిష్కారమా?.. ప్రత్యామ్నాయం కూడా ఉదంటున్న నిపుణులు

by Prasanna |
డిప్రెషన్‌కు మందులే పరిష్కారమా?.. ప్రత్యామ్నాయం కూడా ఉదంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సందర్భంలో వేధించే మానసిక రుగ్మతల్లో డిప్రెషన్ ఒకటి. ఇందుకు రకరకాల కారణాలు దోహదం చేస్తుంటాయి. సమస్య తీవ్రతను, లక్షణాలను బట్టి ప్రొఫెషనల్ సైకియాట్రిస్టులు ట్రీట్మెంట్ అందిస్తుంటారు. అయితే అదే సందర్భంలో బాధితులందరికీ కచ్చితంగా యాంటి డిప్రెసెంట్స్ అవసరం లేదని, కొన్ని సహజ పరిష్కారాలు కూడా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత, విటమిన్ బి12, విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్ వంటి లోపాలవల్ల డిప్రెషన్ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని సరిచేసుకోవడానికి తగిన ఆహార మార్పులు చేసుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా రంగు రంగుల పండ్లు, కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. కుంకుమపువ్వు, కర్కుమిన్ (పసుపులో లభించేవి) కూడా పనిచేస్తాయి. అలాగే న్యూరో ట్రాన్స్‌మిటర్ల పనితీరులో మెరుగుదలకు దోహదం చేసే కార్బో హైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉండే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. మెగ్నీషియం, గ్లైసినేట్, సిట్రేట్, విటమిన్ బి6 వంటి సప్లిమెంట్లు తీసుకోవచ్చు. ఆల్కహాల్‌‌ను, ప్రాసెస్ చేసిన ఆహారాలను అవైడ్ చేయాలి. దీంతోపాటు తరచూ ఫిజికల్ యాక్టివిటీస్, యోగా, సోషల్ కనెక్టివిటీ వంటివి కూడా డిప్రెషన్ సమస్యను దూరం చేస్తాయని మానసిక నిపుణులు చెప్తున్నారు. అందుకే చాలామందిలో డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సమస్యలు ఏర్పడినా కొంతకాలం తర్వాత తగ్గుతుంటాయని, అరుదుగా మాత్రమే ట్రీట్మెంట్, వివిధ థెరపీలు అవసరం అవుతుంటాయని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed