PBKS vs GT : పంజాబ్ పరుగుల వరద... గుజరాత్ లక్ష్యం 244

by M.Rajitha |
PBKS vs GT : పంజాబ్ పరుగుల వరద... గుజరాత్ లక్ష్యం 244
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో మంగళవారం గుజరాత్ టైటాన్స్- పంజాబ్ కింగ్స్(PBKS-GT) మధ్య అహ్మదాబాద్ నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 చేసింది. చివరి 10 ఓవర్లలో పంజాబ్ ప్లేయర్స్ భారీగా పరుగులు రాబట్టడంతో స్కోర్ సునాయాసంగా 200 దాటింది. కాగా పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Ayyar) కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు. 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. లాస్ట్ లో వచ్చిన శశాంక్ 44 పరుగులతో మెరుపులు మెరిపించాడు. సాయి కిషోర్ 3 వికెట్లు తీశాడు. 244 పరుగుల లక్ష్యంతో గుజరాత్ కాసేపట్లో బరిలోకి దిగనుంది.

Next Story