లైట్ బీర్‌తో ఆ భారీ సమస్య మాయం.. తాజా అధ్యయనంలో వెల్లడి!!

by Anjali |   ( Updated:2024-03-05 10:08:43.0  )
లైట్ బీర్‌తో ఆ భారీ సమస్య మాయం.. తాజా అధ్యయనంలో వెల్లడి!!
X

దిశ, ఫీచర్స్: పెళ్లిళ్లు, ఫంక్షన్లు, బర్త్ డేస్, చావు, సంతోషం, విచారం, కోపం, దుఖం, బాధ, ఎమోషనల్ ఏదొచ్చినా సరే మగవారికి ముందు గుర్తొచ్చేది మద్యం. డ్రింక్ చేయడానికి ప్రత్యేకమైన కారణం అంటూ మాకు ఏం లేదనే బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. అయితే మద్యం సేవించడంతో చాలామంది బీర్ నే సెలెక్ట్ చేసుకుంటారు. ఇతర ఆల్కహాల్ ఉత్పత్తుల కన్నా బీర్ ప్రమాదకరమైనది కాదు. అలాగే బీర్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని.. అందులో లైట్ బీర్ తాగితే ఎంతో మంచిదని తాజాగా నిపుణులు వెల్లడించారు. తాజా అధ్యయనం ప్రకారం చూసినట్లైతే..

బీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మితంగా బీరు తాగడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. గుండెకు ఆరోగ్య కరమైన ఆల్కహాలిక్ పానియంగా బీర్‌ను చెబుతుంటారు. కాగా బీర్ రోజుకో గ్లాస్ తాగితే ఊబకాయం, లివర్ సంబంధిత వ్యాధులను తరిమికొట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు.

బీర్ తీసుకోని వారితో పోలిస్తే బీర్ తాగేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 42 శాతం తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మూత్రనాళ వ్యవస్థలో అదనపు కాల్షియం నిల్వల నిరోధించడంలో మితమైన బీర్ వినియోగం మేలు చేస్తుంది. ఇది అధిక మూత్ర ఉత్పత్తితో మూత్ర నాళాలను విస్తరింపజేసి మూత్ర పిండాల రాళ్లను నొప్పి లేకుండా ఫ్లష్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కాగా లైట్ బీర్ ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బీర్ అనేది డైటరీ సిలికాన్ మూలం. ఇది బోన్స్ ను పలచబడటాన్ని నిరోధిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బీర్‌లో ఉండే కరిగే ఫైబర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. బీర్‌లో చేదుగా ఉండే ఆమ్లాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి ఆహారం జీర్ణం అవడాన్ని మెరుగుపరుస్తాయి. అయితే లైట్ బీర్ తో ఇన్ని ప్రయోజనాలున్నాయని ఎక్కువగా తాగినట్లైతే పలు వ్యాధుల బారిన పడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. కాగా రోజుకు ఒక గ్లాస్ లేదా రెండు గ్లాసుల బీర్ మాత్రమే ఆరోగ్యానికి మేలని చెబుతున్నారు.

Read More..

పిల్లల్లో ఆకలి కలిగించే ఆహార పదార్ధాలు ఏంటో తెలుసా..?

Advertisement

Next Story