‘ఆ విషయం’లో దూరం పాటిస్తున్నారా?.. హెల్తీ బెనిఫిట్స్ కోల్పోయినట్లే !

by Hamsa |   ( Updated:2023-09-05 16:56:11.0  )
‘ఆ విషయం’లో దూరం పాటిస్తున్నారా?.. హెల్తీ బెనిఫిట్స్ కోల్పోయినట్లే !
X

దిశ, ఫీచర్స్: దాంపత్య జీవితం ఆనందంగా సాగాలంటే ఇతర అంశాలతో సెక్స్ కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. అయితే బిజీ లైఫ్ షెడ్యూల్, చిన్న చిన్న తగాదాలు, పలు ఇతర కారణాలతో ఇటీవల సెక్స్‌కు దూరంగా ఉండేవారి సంఖ్య పెరుగుతోంది. కొద్దిరోజులు అలా ఉంటే ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ దీర్ఘకాలంపాటు అదే జరిగితే శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే బాడీలోని అడిషనల్ కేలరీలను ఖర్చు చేయడానికి శృంగారం ఒక అద్భుతమైన మార్గంగా ఉంటోంది.

దీనివల్ల గుండె జబ్బులు వచ్చే చాయిసెస్ తగ్గుతాయి. అంతేగాక ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ లెవల్స్ మధ్య సమతుల్యతను పెంపొందించడంలో సెక్స్ కీ రోల్ పోషిస్తుంది. పైగా శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆనందానికి కారణమయ్యే ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్‌లు రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతాయి. పరోక్షంగా ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. 50 నుంచి 89 ఏళ్ల మధ్య వయస్సుగలవారు తరచూ సెక్స్‌లో పాల్గొనడంవల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని సెక్సాలజిస్టులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి : పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరంగా ఉందా?

Advertisement

Next Story