సమ్మర్‌లో నీళ్లు తక్కువగా తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?.. కిడ్నీలు పాడవుతాయ్..

by Javid Pasha |   ( Updated:2024-04-22 14:22:25.0  )
సమ్మర్‌లో నీళ్లు తక్కువగా తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?.. కిడ్నీలు పాడవుతాయ్..
X

దిశ, ఫీచర్స్ : వేసవిలో దాహం తీర్చుకోవడానికే కాదు, ఆరోగ్య సంరక్షణలో భాగంగానూ మిగతా సీజన్లకంటే ఎక్కువగా నీళ్లు తాగాలని నిపుణులు చెప్తున్నారు. లేకపోతే డీహైడ్రేషన్ బారిన పడటం, నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు పాడవడం వంటి తీవ్రమైన సమస్యలు దాపురిస్తాయి. అందుకే నిర్జలీకరణ ప్రభావం నుంచి కాపాడుకోవడానికి వాటర్ కంటెంట్, మినరల్స్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, పానీయాలను తీసుకుంటూ ఉండాలి.

వేసవి తాపానికి సహజంగానే మానవ శరీరం ఎక్కువ నీటిని డిమాండ్ చేస్తుంది. రక్తంలో టాక్సిన్స్, అడిషనల్ ఫ్లూయిడ్స్ తొలగించడంలో, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ నిర్వహణలో, రక్తపోటును నియంత్రించడంలో మూత్రపిండాలు కీలకపాత్ర పోషిస్తాయి. అవి సక్రమంగా పనిచేయాలంటే తగినంత నీరు తాగాల్సిన అవసరం ఉంది. అందుకే సాధారణంగా రోజుకు 8 గ్లాసులు లేదా రెండు లీటర్ల నీటిని కనీసం తాగాలి. ఇక బయట తిరిగేవారు, అలాగే దాహం అధికంగా వేస్తున్నప్పుడు బాడీ డిమాండ్ చేసే స్విచ్యువేషన్‌ను బట్టి వేసవిలో ఎంత నీరు తాగినా నష్టం లేదు. కానీ తక్కువ నీరు తాగినే నష్టం. శరీర అవసరాన్ని బట్టి నీరు తాగకుండా ఉంటే కొంతకాలానికి కిడ్నీలు పాడవుతాయి. ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది.

Read More...

Migraine Headache:మైగ్రేన్‌‌‌ సమస్యకి న్యూరో స్టిమ్యులేటర్ ఇంప్లాంట్‌తో చెక్?

Advertisement

Next Story

Most Viewed