- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేధిస్తున్న వెన్నునొప్పి.. 2050 నాటికి తీవ్రంగా పెరుగుతుందంటున్న నిపుణులు
దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వేధిస్తున్న అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యల్లో వెన్నునొప్పి ప్రధానంగా ఉంటోంది. కొన్ని రకాల వైకల్యాలు సంభవించడానికి కూడా ఇది కారణం అవుతోందని, జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాన్సెట్ రుమటాలజీ జర్నల్‌లో పబ్లిషైన ఒక మోడలింగ్ స్టడీ ప్రకారం.. జనాభా పెరుగుదల, వృద్ధాప్యం కారణంగా 840 మిలియన్లకు పైగా ప్రజలు 2050 నాటికి తీవ్ర వెన్నునొప్పికి గురయ్యే అవకాశం ఉంది. కాలక్రమేణా వెన్నునొప్పి కేసుల ల్యాండ్‌స్కేప్‌ను మ్యాప్ చేయడానికి పరిశోధకులు 204 దేశాల్లో 1990 నుంచి 2020 వరకు గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD) డేటాను విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో బ్యాక్ పెయిన్ బాధితుల పెరుగుదల అత్యధికంగా ఉందని, పురుషులతో పోల్చితే మహిళల్లో ఎక్కువగా ఉందని ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు ప్రొఫెసర్ మాన్యులా ఫెరీరా తెలిపారు.
రీజన్ ఇదే..
బ్యాక్ పెయిన్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం దీనికి సంబంధించిన ట్రీట్‌మెంట్‌పై ఒక స్థిరమైన గ్లోబల్ విధానం లేకపోవడమేనని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే లిమిటెడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కలిగి ఉండటంవల్ల కూడా పరిస్థితులు హెల్త్ కేర్ క్రైసిస్‌కు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో వైకల్యానికి దారితీసే సమస్యల్లో బ్యాక్ పెయిన్ కూడా ఒకటిగా ఉందని పేర్కొంటున్నారు. ‘‘మా విశ్లేషణ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బ్యాక్ పెయిన్ కేసులపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో ఇది మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తుంది’’ అని ప్రొఫెసర్ మాన్యులా అంటున్నారు.
ధూమపానం, అధిక బరువు ఎఫెక్ట్
బ్యాక్ పెయిన్ సమస్య ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా ఉండగా.. క్లినికల్ పరంగా ‘లో బ్యాక్ పెయిన్’ కేసులు నమోదవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. 2017లో వెన్నునొప్పి బాధితుల సంఖ్య అర బిలియన్ల(half a billion) మందికి పైగా ఉందని, 2020లో సుమారు 619 మిలియన్ల వెన్నునొప్పి కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యాయని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే బ్యాక్‌పెయిన్‌తో సంబంధం ఉన్న వైకల్యానికి కనీసం మూడింట ఒక వంతు వృత్తిపరమైన కారకాలు(occupational factors), ధూమపానం, అధిక బరువుకు కారణమని చెప్తున్నారు. ఎక్కువగా పని చేసే అడల్ట్స్‌లో కొంత తక్కువ వెన్ను నొప్పి సమస్యలు ఉంటున్నప్పటికీ, వృద్ధులలో మాత్రం నడుము నొప్పి ప్రాబ్లమ్స్ అధికంగా ఉంటున్నాయని అధ్యయనంలో తేలింది.