- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
40 శాతం మందిని వేధిస్తున్న నిద్రలేమి.. ఏం చేస్తే బెటర్ ?
దిశ, ఫీచర్స్ : జీవన శైలిలో అనుకోని మార్పులు, హెవీ స్ర్కీన్ టైమ్, ఓవర్‌నైట్ వర్కింగ్ డేస్, రకరకాల మానసిక ఒత్తిడులు నిద్రలేమి సమస్యకు కారణం అవుతున్నాయి. దీనివల్ల ఇండియాలో 40 శాతం మంది రాత్రిళ్లు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఆరోగ్యంపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతున్నట్లు గత అధ్యయనాలు కూడా పేర్కొన్నాయి. ముఖ్యంగా ఏకాగ్రత కోల్పోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, డిప్రెషన్ వంటి తీవ్రమైన ప్రాబ్లమ్స్ నిద్రలేమితో ముడిపడి ఉంటున్నాయి. రాత్రిపూట స్మార్ట్ ఫోన్‌ను చూస్తూ గడపడంవల్లే అత్యధిక మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నట్లు యూఎస్ కేంద్రంగా వన్‌పోల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దీంతోపాటు కాఫీలు, టీలు, వేడి వేడి వేపుడు పదార్థాలు రాత్రిళ్లు తరచుగా తీసుకునే అలవాటు కూడా నిద్రలేమికి దారితీస్తోంది. కాబట్టి ఇటువంటి ఆహారపు అలవాట్లను దూరం చేసుకోవాలి. నిద్రను ప్రేరేపించడంలో సహాయపడే రొట్టెలు, చపాతీలు, పెరుగు, పన్నీర్, వెన్న, చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు వంటివి తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి ఒక వ్యక్తి రోజులో 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. కనీసం 5 గంటలైనా కంటినిండా నిద్రపోయే అలవాటు ఉంటే ఎటువంటి అనారోగ్యాలు తలెత్తవు. పైగా సరిపోను నిద్రవల్ల ముఖ వర్ఛస్సు, అందం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయట.
Read More: మీ గ్లామర్ పెరగాలా?.. మునగాకు రసం, అలోవెరా జెల్ వాడండి !