సోషల్ మీడియాలో ‘బాడీ ఇమేజింగ్’ ట్రెండ్స్... పిల్లలపై నెగెటివ్ ఎఫెక్ట్

by Prasanna |   ( Updated:2023-05-24 09:56:22.0  )
సోషల్ మీడియాలో ‘బాడీ ఇమేజింగ్’ ట్రెండ్స్... పిల్లలపై నెగెటివ్ ఎఫెక్ట్
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో తాము అందంగా, ఆకట్టుకునే విధంగా కనిపించాలనే ఉద్దేశంతో టీనేజర్స్ రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. తమ శరీర ఆకృతి కూడా ఇతరులను ఆకర్షించేలా ఉండాలని ఆలోచిస్తుంటారు. అందుకోసం బాడీ ఎడిటింగ్ యాప్‌లను యూజ్ చేస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సజెస్టెడ్ బాడీ ఇమేజ్ ఎడిటింగ్ యాప్స్ యూజ్ చేసి, తమకు ఇష్టమైన విధంగా శరీర ఆకృతిని, ముఖాన్ని మార్చి పోస్టులు పెడుతుంటారు. అయితే ప్రస్తుతం ఇదొక వ్యసనంలా మారిపోయిందని మానసిక నిపుణులు చెప్తున్నారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నిర్దేశించ బడిన అవాస్తవ శరీర ఆకృతులు పిల్లలపై హానికరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని 70 శాతం మంది పేరెంట్స్ కూడా అంగీకరిస్తున్నట్లు ఒక అధ్యయనం స్పష్టం చేసింది.

సెల్ఫ్‌ లవ్ కోల్పోతారు

తరచూ ఇమేజ్ ఎడిటింగ్ అప్లికేషన్స్ యూజ్ చేయడం అనేది కొత్త తరంలో 69 శాతం మంది పిల్లలు తమ శరీరాన్ని అంగీకరించడం, ప్రేమించడం కష్టతరం చేస్తోందని ఒక సర్వేలో తేలింది. వాస్తవ పరిస్థితిలో తమ బాడీ తమకు ఎంతో ముఖ్యమైందనే కాన్ఫిడెంట్‌ను, సెల్ఫ్ లవ్‌ను టీనేజర్స్ కోల్పోతున్నారు. దాదాపు ప్రతీ10 మందిలో ఏడుగురు పేరెంట్స్ న్యూ ఇమేజింగ్ ఎడిటింగ్ యాప్స్, ఫిల్టర్స్‌, శరీర రూపురేఖలకు సంబంధించిన సోషల్ మీడియా ట్రెండ్స్ తమ పిల్లల బాడీ ఇమేజ్‌ను ప్రభావితం చేస్తున్నాయని నమ్ముతున్నారు. 18 ఏళ్లకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై ఈ ప్రభావం అధికంగా ఉంటోంది.

ఆహారం, వ్యాయామంపై ప్రభావం

65 శాతం మంది తల్లిదండ్రులు ఆహారం లేదా వ్యాయామం వంటి ప్రదర్శనలకు సంబంధించిన సోషల్ మీడియా పోకడలు పిల్లలను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు. పిల్లలతో ఆహారం గురించి, వారి శరీరాల గురించి మాట్లాడటం చాలా ముఖ్యమైందని యూఎస్‌లోని నేషన్‌వైడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎరిన్ మెక్‌టైర్నాన్ అంటున్నారు. సోషల్ మీడియాలోని ‘ఈటింగ్ కంటెంట్’ కూడా పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని, దీనిపై కూడా పేరెంట్స్ ఫోకస్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

మెంటల్ హెల్త్‌పై ఎఫెక్ట్

సోషల్ మీడియా ఈరోజుల్లో కొనుగోలు ఎంపికల నుంచి అందం యొక్క అవగాహన వరకు ప్రతీ విషయాన్ని ప్రభావితం చేస్తోంది. అత్యధిక సమయం దానికి కేటాయించే టీనేజర్స్, కొందరు పెద్దలు కూడా మెంటల్లీ అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాన్ఫిడెంట్ ఉన్న పేరెంట్స్‌కు కూడా బాడీ ఇమేజ్ గురించిన సంభాషణలు సవాలుగా మారుతున్నాయి. చాలా వరకు ఇందులో వాస్తవానికి భిన్నంగా ఉండే బాడీ ఇమేజింగ్ కంటెంట్ వల్ల పిల్లలు తమ శరీరం గురించి నెగెటివ్‌గా ఫీలింగ్స్ ఏర్పర్చుకునే అవకాశం ఉంటుంది. ఫలానా విధంగా తమ శరీర ఆకృతి లేదని బాధపడుతూ, తమలో ఏవో లోపాలున్నాయని కృంగిపోతూ డిప్రెషన్‌కు లోనయ్యే వారు ఇటీవల కనిపిస్తున్నారు. అందుకే పేరెంట్స్ తగిన కేర్ తీసుకోవాలని మానసిక నిపుణులు చెప్తున్నారు. బాడీ ఇమేజింగ్ సోషల్ మీడియా ట్రెండ్స్ జస్ట్ ఆకట్టుకోవడానికి ఉద్దేశించ బడి ఉంటాయని, వాటిని వ్యక్తిగతంగా ఆపాదించుకోవద్దని పేరెంట్స్ పిల్లలకు చెప్పాలి. అలాగే తమ వాస్తవ శరీరాకృతిపట్ల పిల్లలు సానుకూల దృక్పథంతో ఉండేలా, తమను తాము ఇష్టపడేలా మోటివేట్ చేయాలి. అవసరమైతే మానసిక నిపుణుల ద్వారా కౌన్సెటింగ్ ఇప్పించవచ్చు.

Read More: రిలేషన్‌షిప్‌లో డిఫరెంట్ బిహేవియర్స్.. రీజన్ ఏంటో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed