క్లోజ్ ఫ్రెండ్‌ సర్కిల్‌తో హెల్త్ బెనిఫిట్స్.. స్ట్రోక్, హార్ట్ ఎ‌టాక్ రిస్క్ తగ్గుతుందంటున్న నిపుణులు

by Dishafeatures2 |
క్లోజ్ ఫ్రెండ్‌ సర్కిల్‌తో హెల్త్ బెనిఫిట్స్.. స్ట్రోక్, హార్ట్ ఎ‌టాక్ రిస్క్ తగ్గుతుందంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : స్నేహం అద్భుతమైంది మాత్రమే కాదు, అది గమ్మత్తైనది కూడా కావచ్చు. ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తుల అంచనాలు, అభిప్రాయాలు ఒక్కటిగా ఉండవు. అయినప్పటికీ స్నేహంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇవేమీ అడ్డంకిగా మారడం లేదని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. అసలు ఫ్రెండ్ అంటే ఎవరు? ఎలా ప్రవర్తించాలని మీరు ఆశిస్తారు? మీలో అంచనాలు ఎక్కువే ఉండవచ్చు. కానీ అదే సందర్భంలో అవతలి వ్యక్తి అవసరాన్ని గుర్తిస్తారు. అభిప్రాయాన్ని, సరిహద్దులను గౌరవిస్తారు. అందుకే స్నేహంలో అంచనాలు, జడ్జిమెంట్‌లు ఏవైనా ప్రజలకు మేలు చేస్తాయని, స్నేహంవల్ల ఆనందంతోపాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం

ధైర్యాన్నిస్తుంది

వాస్తవానికి ఫ్రెండ్‌షిప్ మీ జీవితాన్ని అనేక విధాలుగా సుసంపన్నం చేస్తుంది. స్నేహం యొక్క గొప్పతనం పట్ల అవగాహన కల్పిస్తుంది. మీరు మంచి వ్యక్తిగా ఉండటానికి అవసరమైన ఛాలెంజ్ విసురుతుంది. ఆపద సమయంలో ధైర్యంగా నిలబడేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. సక్సెస్ సాధించినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి మీ ప్రాణ స్నేహితులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అందుకే స్నేహం గొప్పది అంటున్నారు నిపుణులు.

ఆరోగ్యానికి టానిక్ లాంటిది

బలమైన సామాజిక సంబంధాలను కలిగి ఉండటం వల్ల మెరుగైన శారీరక ఆరోగ్యంతోపాటు దీర్ఘాయుష్షుతో ముడిపడి ఉన్నట్లు పలు అధ్యయనాలు కూడా పేర్కొంటున్నాయి. క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ కలిగి ఉండటంవల్ల కూడా డయాబెటిస్, హార్ట్‌ ఎటాక్, స్ట్రోక్ వంటి అనారోగ్యాల రిస్క్ తగ్గుతుందట. అంతేకాదు మీ మనసులోని మాటలను షేర్ చేసుకోవడానికి, సలహా అడగడానికి స్నేహితులు అవసరం. సోషల్ డిపెండెన్సీలో కూరుకుపోయినప్పుడు కూడా మీలోని స్వీయ-విలువను ధృవీకరించడానికి, మిమ్మల్ని గట్టెక్కించడానికి ఉపయోగపడేది ఫ్రెండ్‌షిప్ మాత్రమే.

అంచనాలు, సరిహద్దులు

స్నేహం, స్నేహితుల విషయంలో అంచనాలు ఉంటాయి. కొన్నిసార్లు టూమచ్‌గా ఉండవచ్చు. అయితే ఇవన్నీ ఒకరి అభిప్రాయాలను, ఆలోచనలను, సరిహద్దులను మరొకరు గౌరవించుకునే పరిధిలోనే ఉంటాయి. ఒక స్నేహితుడు మంచి ప్రవర్తన కలవారని, మీ భావాలను గౌరవిస్తారని భావించడం ఒక అంచనా అయితే.. అదే సందర్భంలో మీరు లేదా అవతలి వ్యక్తి కొన్ని బౌండరీస్ కూడా కలిగి ఉండవచ్చు. అలా ఉన్నప్పటికీ పరస్పరం గౌరవించుకోవమే స్నేహం యొక్క గొప్పతనం. ఇందులో కమ్యూనికేషన్, సమయం, సందర్భం, అన్యోన్యత కీలకపాత్ర పోషిస్తాయి.


Next Story

Most Viewed